ANGRAU UG Admissions 2026 : అగ్రికల్చర్ డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లు - నోటిఫికేషన్ విడుదల

ANGRAU UG Admissions 2026 : గుంటూరులోని ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో (ANGRAU) వివిధ యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. 

Published on: Jul 10, 2026, 16:37:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ANGRAU UG Admissions 2026 : గుంటూరు లోని ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ANGRAU) నుంచి యూజీ ప్రవేశాల నోటిఫికేషన్ జారీ అయింది. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు అండర్ గ్రాడ్యుయేట్ (UG) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ మేరకు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ కార్యాలయం అధికారిక ప్రవేశాల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

అగ్రికల్చర్ డిగ్రీ ప్రవేశాలు
అగ్రికల్చర్ డిగ్రీ ప్రవేశాలు
  • ఎన్‌ఆర్ఐ (NRI) లేదా ఎన్‌ఆర్ఐ కోటా కింద భర్తీ చేసే సీట్లు : బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్, బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజనీరింగ్), బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ), బీఎస్సీ (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్ కోర్సులలో ఎన్‌ఆర్ఐ కోటా కింద ప్రవేశాలు కల్పిస్తారు.
  • బీఎస్సీ (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్: ఈ కోర్సులో ప్రవేశానికి ఇంటర్మీడియట్ ఎంపీసీ (MPC) లేదా బైపీసీ (BiPC) గ్రూపులు చదివిన వారు అర్హులు. వీరితో పాటు యాంగ్రూ (ANGRAU) నుంచి 2 లేదా 3 ఏళ్ల డిప్లొమా పూర్తి చేసిన వారు, డిప్లొమా ఇన్ వెటర్నరీ సైన్స్, డిప్లొమా ఇన్ హార్టికల్చర్, డిప్లొమా ఇన్ హోమ్ సైన్స్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET 2026) స్టేట్ ర్యాంక్ ఆధారంగా ప్రవేశాలు: ఎంపీసీ స్ట్రీమ్ రైతు కోటా (Farmers' Quota) కింద క్రింది కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు. వీటికి ఏపీ ఈఏపీసెట్ 2026 రాష్ట్ర స్థాయి ర్యాంకును పరిగణనలోకి తీసుకుంటారు.

  • బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజనీరింగ్)
  • బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ)

దరఖాస్తు చేసుకునే విధానం:

అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆఫ్‌లైన్ పద్ధతిలో సమర్పించాల్సి ఉంటుంది. పూర్తి చేసిన దరఖాస్తులను అవసరమైన ధ్రువపత్రాలతో కలిపి పోస్ట్ ద్వారా గానీ లేదా నేరుగా అప్లికేషన్‌లో సూచించిన చిరునామాకు నిర్దేశిత గడువులోగా అందజేయాలి. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్ angrau.ac.in ను మాత్రమే సంప్రదించాలి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More