ఆచార్య ఎన్.జీ.రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నోటిఫికేషన్.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా పోస్ట్ భర్తీ!
ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ పరిధిలోని రిజినల్ అగ్రికల్చరల్ రిసెర్చ్ స్టేషన్ గుంటూరులో రిసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ ఉంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 6వ తేదీన ఇంటర్వ్యూకు హాజరుకావాలి.
గుంటూరు జిల్లాలోని ఆచార్య ఎన్.జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం(ANGRAU) పరిధిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం (RARS) కీలక ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. కాటన్ బయోటెక్నాలజీ (NSP) ప్రాజెక్ట్‌లో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేయడానికి రిసెర్చ్ అసోసియేట్ పోస్టు భర్తీకి వాక్-ఇన్-ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రిసెర్చ్ డాక్టర్ ఎన్.వి.వి.ఎస్.దుర్గాప్రసాద్ తెలిపారు.

రిసెర్చ్ అసోసియేట్ (జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ / అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ) 1 పోస్టుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. చేరిన నాటి నుంచి 11 నెలల పాటు (ఒప్పంద ప్రాతిపదికన) పని చేయాలి. సంబంధిత విభాగంలో (Genetics & Plant Breeding / Agri. Biotechnology) Ph.D చేసి ఉండాలి. సంబంధిత రిసెర్చ్ లేదా టీచింగ్‌లో కనీసం 3 ఏళ్ల అనుభవం ఉన్న M.Sc (Ag.) అభ్యర్థులు కూడా అర్హులు. నెట్ కూడా క్వాలిఫై అయి ఉండాలి.
డిగ్రీలు తప్పనిసరిగా ICAR గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల నుంచి పొంది ఉండాలి. పురుషులకు గరిష్టంగా 40 ఏళ్లు, మహిళలకు 45 ఏళ్ల వరకు సడలింపు ఉంటుంది. నిబంధనల ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయోపరిమితిలో ఉపశమనం ఉంటుంది.
M.Sc (Ag.) పూర్తి చేసిన వారికి నెలకు రూ. 61,000 ప్లస్ హెచ్ఆర్ఏ చెల్లిస్తారు. Ph.D ఉన్న అభ్యర్థులకు నెలకు రూ. 67,000 ప్లస్ హెచ్ఆర్ఏ చెల్లిస్తారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎలాంటి ముందస్తు దరఖాస్తులు లేకుండా ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. ఇంటర్వ్యూ తేదీ 06 ఆగస్టు 2026 సమయం: ఉదయం 10:30 గంటలకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం (RARS), లామ్, గుంటూరులో ఉంటుంది.
అభ్యర్థులు తమ బయోడేటాతో పాటు అన్ని విద్యార్హత సర్టిఫికేట్ల ఒరిజినల్స్, రెండు సెట్ల జిరాక్స్ కాపీలు, ఇటీవలి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలి. ఎలాంటి టీఏ/డీఏలు ఇవ్వరు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


