నిప్పుల కొలిమిలా ఆంధ్రప్రదేశ్.. పిడుగురాళ్లలో 47.6 డిగ్రీలు.. రాబోయే 4 రోజులు మరింత డేంజర్
ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అడుగుతీసి బయటపెట్టాలంటే జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేడిగాలులు ప్రజలకు దడపుట్టిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురిపిస్తున్నాడా అన్నట్లుగా ఉష్ణోగ్రతలు రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఊపిరాడకుండా చేస్తున్న ఉక్కపోత, తీవ్రమైన వడగాల్పులతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఈ వేసవి సీజన్‌లోనే అత్యధికంగా బుధవారం పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 47.6 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత భయం పుట్టిస్తోంది ఇప్పటికే 11 జిల్లాల్లో 45 డిగ్రీల మార్కును దాటగా.. 18 జిల్లాల పరిధిలోని దాదాపు 204 మండలాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రతకు రాష్ట్రంలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు.
గురువారం అలర్ట్
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికల ప్రకారం గురువారం రాష్ట్రంలో ఎండలు మరింత ముదరనున్నాయి. సుమారు 74 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు, 232 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే ప్రమాదం ఉంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఎండలు 47 డిగ్రీల దాకా వెళ్లొచ్చు.
విజయనగరం, మార్కాపురం ప్రాంతాల్లో 44 నుండి 45 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. శ్రీకాకుళం, విశాఖపట్నం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, తిరుపతి జిల్లాల్లో 40 నుండి 43 డిగ్రీలు ఎండల ప్రభావం ఉంటుంది. శుక్ర, శనివారాల్లో కూడా ఉష్ణోగ్రతలు భారీగానే ఉంటాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
వైద్యారోగ్య శాఖ అలర్ట్
రాష్ట్రంలో మండుతున్న ఎండలపై వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల నుంచి పెద్ద బోధనాసుపత్రుల వరకు అన్నిటా వడదెబ్బ బాధితులకు తక్షణ వైద్యం అందించేలా సన్నద్ధం కావాలని ఆదేశించారు. ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి 1 నుంచి మే 19 వరకు రాష్ట్రంలో 325 వడదెబ్బ అనుమానిత కేసులు నమోదయ్యాయి. ఎండలను తట్టుకునేందుకు వీలుగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 1.44 కోట్ల ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచింది.
విపత్తుల నిర్వహణ సంస్థ అత్యవసర సూచన
రానున్న నాలుగు రోజుల పాటు ఎండ తీవ్రత గరిష్ఠంగా ఉంటుంది. కాబట్టి అత్యవసరమైతే తప్ప ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మరో నాలుగు రోజులు ఇదే పరిస్థితి ఉండనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


