Vontimitta : మార్చి 26 నుంచి ఒంటిమిట్ట‌లో వార్షిక బ్రహ్మోత్సవాలు - వాహన సేవల వివరాలు

Vontimitta  Brahmotsavams 2026 :మార్చి 26 నుండి ఏప్రిల్ 5 వరకు ఒంటిమిట్ట‌ శ్రీ కోదండ‌రామ‌స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. మార్చి 24న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం, మార్చి 26న బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌ నిర్వహిస్తారు. 

Published on: Mar 06, 2026 5:00 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

క‌డ‌ప‌ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆల‌యంలో మార్చి 26 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 5వ తేదీ వ‌ర‌కు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభ‌వంగా జ‌రుగ‌నున్నాయి.

ఒంటిమిట్ట‌ శ్రీ కోదండ‌రామ‌స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
ఒంటిమిట్ట‌ శ్రీ కోదండ‌రామ‌స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆల‌యంలో మార్చి 24న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం, మార్చి 26న బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌ నిర్వహిస్తారు. బ్ర‌హ్మోత్స‌వాల‌లో ప్ర‌తి రోజు ఉద‌యం 7.30 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు వాహ‌న సేవ‌లు జ‌రుగుతాయి. ఈ వివరాలను టీటీడీ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు - వాహనసేవల వివరాలు :

  • మార్చి 27. 03.2026 : ఉదయం – ధ్వజారోహణం (ఉద‌యం 9.30 నుండి 10.15 గంట‌ల వ‌ర‌కు వృష‌భ‌ లగ్నం), ఉదయం 11 గం.ల నుండి 12 గం.ల వరకు శ్రీరామనవమి ఆస్థానం, సాయంత్రం 4 గం.ల నుండి పోతన జయంతి, కవి సమ్మేళనం. రాత్రి శేష వాహన సేవ నిర్వహిస్తారు.
  • 28.03.2026: ఉదయం – వేణుగానాలంకారము, రాత్రి – హంస వాహనం
  • 29.03.2026 : ఉదయం – వటపత్రశాయి అలంకారము, రాత్రి – సింహ వాహనం
  • 30.03.2026: ఉదయం – నవనీత కృష్ణాలంకారము, రాత్రి – హనుమంత వాహనం
  • 31.03.2026 : ఉదయం – మోహినీ అలంకారము, రాత్రి – గరుడసేవ
  • 01-04-2026 : ఉదయం – శివధనుర్భాణ అలంకరణ, మద్యాహ్నం 03.15 గం.లకు కాంత కోరిక, ఎదుర్కోలు ఉత్సవం సాయంత్రం 06.30 గం.ల నుండి 08.30 గం.ల వరకు శ్రీ సీతారామ కల్యాణోత్సవం. రాత్రి గజవాహన సేవ నిర్వహిస్తారు.
  • 02-04-2026 : ఉదయం – రథోత్సవం
  • 03-04-2026 : ఉదయం – కాళీయమర్ధనాలంకారము, రాత్రి – అశ్వవాహనం
  • 04-04-2026 : ఉదయం – చక్రస్నానం, రాత్రి – ధ్వజావరోహణం.
  • ఏప్రిల్ 05వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు పుష్ప‌యాగం ఉంటుంది.

ఒంటిమిట్ట బ్రహ్మోత్సాల సందర్భంగా అన్ని శాఖలు సమన్వయంతో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డా. చెరుకూరి శ్రీధర్ అధికారులకు సూచించారు. టీటీడీ అధికారులతో జరిగిన సమీక్షలో మాట్లాడిన ఆయన… మార్చి 26న అంకురార్పణతో కార్యక్రమాలు ప్రారంభమై, మార్చి 27న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు మొదలవుతాయని తెలిపారు. ఏప్రిల్ 1న జరిగే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పట్టు వస్త్రాల సమర్పణ జరగనుందని చెప్పారు.

ఈ సందర్భంగా టీటీడీ జేఈవో వి వీరబ్రహ్మం మాట్లాడుతూ…. భక్తుల రద్దీ దృష్ట్యా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, గ్యాలరీలు, పార్కింగ్, పబ్లిక్ అడ్రెస్ సిస్టమ్ వంటి ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని సూచించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని చలువ పందిళ్లు, తాగునీరు, మజ్జిగ, అన్నప్రసాదాలు, వైద్య సదుపాయాలు కల్పించాలని అధికారులకు ఆదేశించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More