Vijay Rashmika Temple Visit: జూబ్లీహిల్స్ టీటీడీ టెంపుల్లో విజయ్, రష్మిక.. అభిమానులకు స్వీట్లు పంచుతూ.. వీడియో వైరల్
ఉదయపూర్‌లో వైవాహిక బంధంతో ఒక్కటైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న(Vijay Rashmika Tirumala Visit) దంపతులు తాజాగా హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఉన్న టీటీడీ ఆలయాన్ని సందర్శించారు. కొత్త ప్రయాణం సుఖమయంగా సాగాలని కోరుకుంటూ స్వామివారి ఆశీస్సులు తీసుకున్న ఈ జంట.. భక్తులకు స్వీట్లు పంచుతూ సందడి చేశారు.
టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ వైవాహిక జీవితాన్ని ఆధ్యాత్మికంగా ప్రారంభించారు. ఫిబ్రవరి 26న ఉదయపూర్‌లో అత్యంత సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్న ఈ జంట.. ఆదివారం (మార్చి 1) ఉదయం హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాన్ని సందర్శించారు. పెళ్లి తర్వాత మొదటిసారిగా బయట కనిపించిన ఈ జంటను చూసేందుకు భక్తులు, అభిమానులు భారీగా తరలివచ్చారు.

భక్తుల మధ్య రష్మికకు రక్షణగా విజయ్..
హైదరాబాద్ లోని టీటీడీ ఆలయ పరిసరాల్లో విజయ్, రష్మికలు సందడి చేస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రద్దీ ఎక్కువగా ఉండటంతో, విజయ్ తన భార్య రష్మికకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ కనిపించాడు. ఆమె చుట్టూ రక్షణగా ఉంటూ.. భక్తుల మధ్య నుంచి జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లడం నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.
ట్రెడిషనల్ లుక్‌లో మెరిసిపోయిన జంట
కొత్త పెళ్లికూతురు రష్మిక ఆకుపచ్చ, బంగారు రంగు కలనేత చీరలో, సంప్రదాయ బంగారు ఆభరణాలతో మెరిసిపోయింది. విజయ్ తెల్లటి కుర్తా పైజామా ధరించి, భుజంపై ఎరుపు రంగు శాలువాతో ఎంతో హుందాగా కనిపించాడు. ఈ దంపతులతో పాటు విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ కూడా స్వామివారిని దర్శించుకున్నారు.
ఫ్యాన్స్‌కు థ్యాంక్స్.. స్వీట్ల పంపిణీ
తమను చూసేందుకు వచ్చిన భక్తులకు ఈ జంట స్వీట్లను పంపిణీ చేసి ఆశ్చర్యపరిచారు. అభిమానులు ఫోటోల కోసం ఎగబడగా, వారికి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలిపిన విజయ్-రష్మిక దంపతులు.. రద్దీ దృష్ట్యా సెల్ఫీ రిక్వెస్ట్‌లను సున్నితంగా తిరస్కరించి ముందుకు సాగారు.
విజయ్, రష్మిక పెళ్లి తర్వాత పెద్ద మనసు చాటుకున్నారు. ఆదివారం (మార్చి 1) తిరుమలలోనే కాదు దేశవ్యాప్తంగా పలు చోట్ల స్వీట్లు పంచడంతోపాటు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని వాళ్లు ఓ ప్రకటనలో చెప్పారు.
రెండు సంప్రదాయాల మేళవింపుగా వివాహం
ఉదయపూర్‌లోని ఐటీసీ మెమెంటోస్ (ITC Mementos)లో జరిగిన వీరి వివాహం ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. విజయ్ వైపు నుంచి తెలుగు సంప్రదాయాలు, రష్మిక వైపు నుంచి కొడవ (కూర్గ్) పద్ధతుల ప్రకారం ఈ పెళ్లి వేడుకలు జరిగాయి. ప్రముఖ డిజైనర్ అనామికా ఖన్నా ఈ జంట కోసం ప్రత్యేకంగా వెడ్డింగ్ డ్రెస్సులను రూపొందించారు. వీరి పెళ్లి ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 2.4 కోట్ల లైక్స్‌తో గత రికార్డులను తిరగరాయడం విశేషం.
'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాలతో వెండితెరపై మ్యాజిక్ చేసిన ఈ జంట, ఇప్పుడు నిజజీవితంలోనూ ఒక్కటవ్వడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక వీళ్ల రిసెప్షన్ మార్చి 4న జరగనున్న విషయం తెలిసిందే. దీనికోసం ఇప్పటికే వాళ్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానించారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


