ఆగ్నేయ బంగాళాఖాతం, తూర్పు మధ్య బంగాళాఖాతం పరిధిలో మయన్మార్-అండమాన్ పరిసర ప్రాంతాల్లో మరో వాయుగుండం ఏర్పడినట్టుగా భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. రాబోయే 12 గంటల వ్యవధిలో ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే సూచనలు స్పష్టంగా ఉన్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతం ఈ వాయుగుండం అండమాన్‌లోని మాయాబందర్ ప్రాంతానికి తూర్పు-ఈశాన్య దిశగా సుమారు 580 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ప్రస్తుతం ఉత్తర-వాయవ్య దిశగా పయనిస్తూ బంగ్లాదేశ్ వైపు వెళ్తుంది. రాగల 72 గంటల్లో ఈశాన్య బంగాళాఖాతం నుంచి బంగ్లాదేశ్ తీరం మధ్య ప్రదేశంలో ఇది తీరాన్ని దాటే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ తీవ్ర వాయుగుండం నేరుగా ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపకపోయినప్పటికీ, దాని ఉపరితల ఆవర్తనం, తేమ గాలుల ప్రభావంతో తీరప్రాంతాల్లో వాతావరణంలో వేగంగా మార్పులు రానున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమ వ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది.
తీరం వెంట గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే వీలుంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వేటకు వెళ్లే మత్స్యకారులు తీరం దాటి వెళ్లకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
ఇటీవలే బంగాళాఖాతంలో సంభవించిన తీవ్ర వాయుగుండం శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం వద్ద తీరం దాటిన సంగతి తెలిసిందే. దాని తీవ్ర ప్రభావం వల్ల ఉత్తరాంధ్రతో పాటు పరిసర జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా కురిసిన భారీ వర్షాలు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం-మన్యం జిల్లాల్లోని రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి. ఎడతెరిపి లేని వర్షాలు, బలమైన గాలులు, ఆకస్మిక వరదల వల్ల వేలాది హెక్టార్లలోని వ్యవసాయ, ఉద్యాన పంటలు ధ్వంసమయ్యాయి.
ప్రాథమిక అంచనాల ప్రకారం.. ఈ మూడు జిల్లాల్లో వరి, మొక్కజొన్న, పత్తి వంటి వ్యవసాయ పంటలు 13,550 హెక్టార్లలో (33,850 ఎకరాలు), అరటి, బొప్పాయి, కూరగాయల వంటి ఉద్యాన పంటలు 1,030 హెక్టార్లలో (2,500 ఎకరాలు) దెబ్బతిన్నాయి. అంతేకాకుండా బలమైన గాలుల ధాటికి 1,304 కొబ్బరి చెట్లు, 670 ఆయిల్ పామ్ చెట్లు నేలకూలాయి.
{{/usCountry}}ప్రాథమిక అంచనాల ప్రకారం.. ఈ మూడు జిల్లాల్లో వరి, మొక్కజొన్న, పత్తి వంటి వ్యవసాయ పంటలు 13,550 హెక్టార్లలో (33,850 ఎకరాలు), అరటి, బొప్పాయి, కూరగాయల వంటి ఉద్యాన పంటలు 1,030 హెక్టార్లలో (2,500 ఎకరాలు) దెబ్బతిన్నాయి. అంతేకాకుండా బలమైన గాలుల ధాటికి 1,304 కొబ్బరి చెట్లు, 670 ఆయిల్ పామ్ చెట్లు నేలకూలాయి.
{{/usCountry}}వ్యవసాయ శాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(APAIMS) యాప్ ద్వారా పంట నష్టాన్ని నమోదు చేసే ప్రక్రియ నడుస్తోంది. ఇందులో రైతుల పేర్లు, బ్యాంక్ ఖాతా వివరాలు, దెబ్బతిన్న పంటల ఫోటోల వంటి సమాచారాన్ని సిస్టమ్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు.