పంచాయతీ ఎన్నికల్లో జనసేన శ్రేణులకు పూర్తి స్వేచ్ఛ.. నామినేషన్ల గడువు అయిపోయాక పార్టీ ప్రకటన!

AP Panchayat Elections 2026 : ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ కీలక ప్రకటన చేసింది. అయితే దీనిపై క్షేత్రస్థాయిలో కొందరు నేతలు మాత్రం మండిపడుతున్నారు.

Published on: Nov 22, 2026, 12:24:55 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కోసం జనసేన పార్టీ ప్రకటన చేసింది. పూర్తి స్వేచ్ఛగా ఎవరైనా పోటీ చేయవచ్చని తెలిపింది. గ్రామపంచాయతీ ఎన్నికలు అనేవి రాజకీయ పార్టీలకు అతీతంగా, స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో జరిగే ఎన్నికలు అని పార్టీ వెల్లడించింది. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ప్రతి ఒక్కరికీ ఎలాంటి రాజకీయపరమైన అడ్డంకులు లేకుండా నామినేషన్ దాఖలు చేసి, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంటుందని వివరించింది.

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్

'ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ఎవరైనా స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసి పోటీ చేయవచ్చు అని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన శ్రేణులను జనసేన నాయకులు అడ్డుకోకూడదు అని ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తరహాలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి స్థానాల పంపకాలు ఉండవు. జనసేన పార్టీ తరఫున స్వేచ్ఛాపూరిత వాతావరణంలో ఎన్నికలు జరగాలని స్పష్టం చేస్తున్నాం.' అని జనసేన పార్టీ ప్రకటించింది.

అయితే దీనిపై మాత్రం సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. రెండు విడతల నామినేషన్లు ముగిసిన తర్వాత పార్టీ అధిష్ఠానం నుంచి ఇటువంటి ప్రకటన రావడం ఏంటని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది గ్రామాల్లో వెనక్కు తగ్గారని అంటున్నారు. మెుదటి విడత నామినేషన్ల స్వీకరణ సమయంలోనే పవన్ కళ్యాణ్ నుంచి ఇలాంటి ప్రకటన వస్తే బాగుండేదని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లు

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే స్పందించి, సమస్యలను పరిష్కరించేలా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. ఈ హెల్ప్ డెస్క్ సభ్యులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ, పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేలా పనిచేస్తారు. ఏవైనా ఇబ్బందులు లేదా సమస్యలు ఎదురైతే వాటిని వెంటనే పార్టీ కేంద్ర ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ దృష్టికి తీసుకురావాలని అధ్యక్షులు ఆదేశించారు. ఈ ప్రత్యేక హెల్ప్ డెస్క్ కార్యకలాపాలను జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ పర్యవేక్షిస్తారు.

జోన్ I : శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, ASR, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలు.

సభ్యులు: సుందరపు విజయ్ కుమార్, వంశీ కృష్ణ శ్రీనివాస్, పెద్దిశెట్టి ఉషశ్రీ, గుర్నాన అయ్యలు, తుమి లక్ష్మీ రాజ్, కోరికాన రవి కుమార్, జీకే వసంత.

జోన్ II: తూర్పుగోదావరి, కాకినాడ, డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలు.

సభ్యులు: బొలిశెట్టి శ్రీనివాస్, గంటా స్వరూప, యాళ్ల నాగ సతీష్, బార్లపూడి క్రాంతి, ఘంటసాల వెంకట లక్ష్మి.

జోన్ III: ఎన్టీఆర్, కృష్ణ, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలు.

సభ్యులు: సామినేని ఉదయభాను, మండలి రాజా, శివ పార్వతి, బడే కోమలి, రాయపాటి అరుణ.

జోన్ IV: నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాలు.

సభ్యులు: నాగరత్నం యాదవ్, ఆకేపాటి సుభాషిణి, సుంకర శ్రీనివాస్, అతికారి కృష్ణ

జోన్ V: నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి జిల్లాలు.

సభ్యులు: నవీన్ నిశ్చల్, టీసీ వరుణ్, రేఖా గౌడ్, ఎరిగల రామ్ పుల్లారెడ్డి.

ABOUT THE AUTHOR

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.