...
...
Next Story

ఎప్పుడైనా.. ఎక్కడైనా.. దొంగ ఈజీగా దొరికిపోతాడు.. ఏపీ పోలీసుల కొత్త టెక్నాలజీ!

Andhra Pradesh Police : ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు నేరస్థుల ఆటకట్టించడానికి కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. దీనితో దొంగలు ఈజీగా దొరుకుతారు. ఆ వివరాలేంటో తెలుసుకోండి.

Published on: Mar 31, 2026, 15:14:53 IST
Advertisement

పోలీసు వ్యవస్థ రోజురోజుకు కొత్త టెక్నాలజీతో అప్‌డేట్ అవుతోంది. ఏఐని కూడా పోలీసులు కేసులో విచారణలో భాగంగా ఉపయోగిస్తున్నారు. నేరస్థుల పట్టుకునేందుకు ఎప్పటికప్పుడు పోలీసులు అప్‌డేట్ అవుతున్నారు. అందులో భాగంగా పోలీసులు కొత్త టెక్నాలజీని ఉపయోగించి.. పాత నేరస్థులు, దొంగలను పట్టుకుంటున్నారు. ఇందుకోసం పాపిల్లాన్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను అందుబాటులోకి తెచ్చారు.

పాపిల్లాన్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌
పాపిల్లాన్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌

ఈ పాపిల్లాన్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ ద్వారా నేరస్థులను ఈజీగా గుర్తించవచ్చు. దీనిని పోలీసులు అధికారులు ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ఒక్కసారి థంబ్ పెడితే.. పాత నేరస్థులు, దొంగల పూర్తి వివరాలు కనిపిస్తాయి. ఏపీలో పోలీసులు ఈ స్కానర్‌ను వాడుతున్నారు. రాత్రి సమయంలో అనుమానాస్పదంగా తిరిగేవారిని గుర్తించడంలోనూ ఈ సిస్టమ్ ఉపయోగపడుతుంది.

పాపిల్లాన్‌ ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌తో నేరస్థుల్ని ఈజీగానే పట్టుకోవచ్చు. అంతేకాదు నేరాలు చేస్తున్నవారి నేర చరిత్ర మెుత్తాన్ని సెకన్ల వ్యవధిలోనే ఈ వ్యవస్థ చూపిస్తుంది. పాత నేరస్థులు, దొంగలను పట్టుకోవడానికి ఈ స్కానర్ బాగా ఉపయోపడుతుంది. ఈ స్కానర్ చిన్నగా ఉంటుంది. దీంతో పోలీసులు ఎక్కడికైనా దీనిని ఈజీగా తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుంది.

పాపిల్లాన్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌‌ను మెుబై‌ల్‌ యాప్‌తో కనెక్ట్ చేస్తారు పోలీసులు. స్కానర్ మీద నేరస్థుల, అనుమానితుల బొటన వేలు లేదంటే చూపుడు వేలు పెట్టాలి. అ తర్వాత కొన్ని వివరాలు నమోదు చేయాలి. ఇక వెంటనే వ్యక్తికి సంబంధించిన కేసులు ఉంటే ఫోన్‌లో చూపిస్తుంది. కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

అతడిపై ఎన్ని కేసులు ఉన్నాయి, ఎక్కడ నమోదు అయ్యాయి, గతంలో చేసిన నేరాలు ఏంటిలాంటి వివరాలు క్షణాల్లో పోలీసులకు తెలిసిపోతుంది. ఒకవేళ అనుమానించిన వ్యక్తిపై ఎలాంటి కేసులు లేకపోతే నాట్ ఫౌండ్ అని చూపిస్తుంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe