South Central Railway : మద్యం తాగి డ్యూటీకి లోకో పైలట్లు.. దక్షిణ మధ్య రైల్వేలో 102 కేసులు

South Central Railway : గత ఐదేళ్లలో 102 మంది లోకో పైలట్లు మద్యం సేవించినట్టుగా తేలింది. దీంతో అధికారులు చర్యలు తీసుకున్నారు.

Published on: Mar 4, 2026, 16:26:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దక్షిణ మధ్య రైల్వే (SCR) జోన్‌లో గత ఐదు సంవత్సరాలలో 102 మంది లోకో పైలట్లు మద్యం సేవించి విధులకు హాజరయ్యారు. 2025లో 22 కేసులను, 2024లో 17 కేసులను అధికారులు గుర్తించారు. ఈ సంఖ్యలు ఈ కాలంలో ఇలా ఉన్నప్పిటకీ.. ఒక లోకో పైలట్‌ను మాత్రమే అధికారులు సస్పెండ్ చేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం అతను గుంటూరు డివిజన్‌కు చెందినవాడు.

సౌత్ సెంట్రల్ రైల్వే
సౌత్ సెంట్రల్ రైల్వే

పట్టుకున్న వారిలో రక్తంలో ఆల్కహాల్ కంటెంట్(BAC) 100 mlకి 20 mg, 40 mg మధ్య ఉంది. పైలట్లు రైళ్లు ఎక్కడానికి ముందు నిర్వహించిన తప్పనిసరి బ్రీతలైజర్ పరీక్షల సమయంలో అధికారులు ఈ కేసులను గుర్తించారు. దక్షిణ మధ్య రైల్వేలో ఆరు డివిజన్లు ఉన్నాయి. 2025లో గుంతకల్ ఏడు కేసులు, నాందేడ్ ఆరు కేసులు నమోదయ్యాయి.

రైల్వే ప్రయాణికులు ఈ ఫలితాలపై ఆందోళన వ్యక్తం చేస్తు్న్నారు. లోకో పైలట్లు వేలాది మంది ప్రయాణికులను, భారీ సరుకును తీసుకెళ్లే రైళ్లను నడుపుతారని మండిపడుతున్నారు. పైలట్ స్థాయిలో ఏదైనా లోపం నేరుగా ప్రయాణికులను ప్రమాదంలో పడేస్తుందని అంటున్నారు. సిగ్నల్, స్పీడ్‌లాంటి ఉల్లంఘనలు జరిగే అవకాశం ఉందన్నారు

మరోవైపు రైల్వే అధికారులు మాత్రం ఈ విషయం క్లారిటీ ఇచ్చారు. సేఫ్టీ ప్రోటోకాల్‌లు మత్తులో ఉన్న సిబ్బంది రైళ్ల బాధ్యతను చేపట్టకుండా నిరోధిస్తాయని రైల్వే అధికారులు స్పష్టం చేస్తున్నారు. మత్తులో ఉన్న వ్యక్తిని రైలుకు సంబంధించిన బాధ్యతలను అప్పగించమని చెబుతున్నారు.

అంతేకాదు లోకో పైలట్లకు సైన్ ఇన్, సైన్ ఆఫ్ చేసిన ప్రతిసారీ బ్రీతలైజర్ పరీక్షలు చేయించుకుంటారు. ప్రయాణాల సమయంలో అధికారులు ఆకస్మిక తనిఖీలను కూడా నిర్వహిస్తారు. డ్యూటీలో ఉన్నప్పుడు మద్యం సేవించకుండా లోకో పైలట్లు, అసిస్టెంట్ లోకో పైలట్‌లపై ఫోకస్ ఉంటుంది. నామినేటెడ్ ఇన్‌స్పెక్టర్లతో క్రమం తప్పకుండా కౌన్సెలింగ్ సెషన్‌లను కూడా నిర్వహిస్తారు. భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఉండేలా ఫుట్-ప్లేటింగ్ తనిఖీలు, ఆకస్మిక తనిఖీల ద్వారా పర్యవేక్షణ చేస్తుంది రైల్వే.

బ్రితలైజర్ టెస్టుల్లో ఒక వ్యక్తి 100 mlకు 1 mg నుంచి 20 mg మధ్య బీఏసీ నమోదు చేస్తే, అధికారులు ఆ వ్యక్తిని ఆ రోజు విధుల నుండి నిషేధిస్తారు. BAC 100 mlకు 20 mg మించితే.. గాఢత స్థాయి ఆధారంగా జరిమానాలు విధిస్తారు. కేసు ఆధారంగా చర్యను నిర్ణయిస్తారు.

ఒక ఉద్యోగికి ఆల్కహాల్ స్థాయితో సంబంధం లేకుండా మూడుసార్లు తాగినట్టుగా గుర్తిస్తే.. చర్యలు తీవ్రంగా ఉంటాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More