...
...
Next Story

AP SSC Memo : ఏపీ టెన్త్ మార్కుల షార్ట్ మెమోలు విడుదల - తప్పులుంటే సరిచేసుకోవడానికి ఛాన్స్!

AP SSC Marks Memo Download : ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల మార్కుల షార్ట్ మెమోలు అందుబాటులోకి ఉంచాయి. విద్యార్థుల వివరాల్లో ఏవైనా తప్పులు దొర్లితే…. వాటిని సరిచేసుకోవడానికి జూన్ 4 వరకు ఎడిట్ ఆప్షన్ కల్పించారు.

Published on: May 27, 2026 07:08 AM IST
Advertisement

AP SSC Marks Memo Download : ఏపీ పదో తరగతి మెమోలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ప్రాథమికంగా షార్ట్ మెమోలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ షార్ట్‌ మెమోలను అధికారిక వెబ్‌సైట్‌తో పాటు సంబంధిత పాఠశాలల లాగిన్‌ ఐడీలలో అందుబాటులో ఉంచినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ మెమోలను డౌన్‌లోడ్ చేసుకుని వివరాలను పరిశీలించుకోవచ్చు.

ఎడిట్ ఆప్షన్…

షార్ట్ మెమోలు
షార్ట్ మెమోలు

ఈసారి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్కుల మెమోలలో విద్యార్థుల పేర్లు, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేర్లు లేదా ఇతర వివరాలు ఏవైనా తప్పుగా నమోదైతే… వాటిని ఆన్‌లైన్‌లోనే సరి చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇందుకోసం ప్రత్యేకంగా 'ఎడిట్‌ ఐచ్ఛికం' (Edit Option) తీసుకువచ్చారు.

ఈ నెల 29వ తేదీ నుంచి జూన్‌ 4వ తేదీ వరకు విద్యార్థులు తమ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల (HM) ద్వారా వివరాలను ఆన్‌లైన్‌లో సరిచేయించుకోవచ్చు. మార్కుల జాబితా అనేది జీవితకాలం అవసరమయ్యే అత్యంత ముఖ్యమైన పత్రం కాబట్టి…. విద్యార్థులందరూ తమ షార్ట్ మెమోలను జాగ్రత్తగా వెరిఫై చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఏమైనా తప్పులుంటే వెంటనే పాఠశాల ప్రిన్సిపాల్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.

ఈ ఏడాది ఏపీ టెన్త్ ఫలితాల్లో 85.25 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఏడాది ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలికలు 87.9 శాతం ఉత్తీర్ణత,, బాలురు 82.68 శాతం ఉత్తీర్ణత సాధించారు.

పదో తరగతి ఫలితాల్లో 96.07 శాతం ఉత్తీర్ణతతో పార్వతీపురం మన్యం జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. అలాగే… 57.12 శాతం ఉత్తీర్ణతతో అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో ఉంది. ఏపీ టెన్త్ ఫలితాలను https://www.bse.ap.gov.in/ వెబ్ సైట్ తో పాటు మనమిత్ర వాట్సప్ నంబరు 9552300009 ద్వారానూ పొందొచ్చు. ఏపీలో 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సుమారు 6.30 లక్షల మంది పబ్లిక్ పరీక్షలు రాశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe