మార్చి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు, ఫిబ్రవరి 14న బడ్జెట్.. ఏఐ ఆధారిత అటెండెన్స్
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై బిజినెస్ అడ్వైజరీ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మార్చి 7వ తేదీ దాకా సమావేశాలు నిర్వహించనుంది. అలాగే ఫిబ్రవరి 14వ తేదీన బడ్జెట్ ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) అసెంబ్లీ సమావేశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. మార్చి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. అవసరమైతే సమావేశాలను పొడిగించే అవకాశం కూడా ఉంది. రాష్ట్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 14న సమర్పించనున్నారు. ఫిబ్రవరి 15 ఆదివారం కావడం, మహా శివరాత్రి తర్వాత ఫిబ్రవరి 16 సెలవు దినంగా ఉన్నందున, బడ్జెట్‌పై చర్చలు ఫిబ్రవరి 17, 18 తేదీలలో జరుగుతాయి. ఫిబ్రవరి 18న చర్చకు ఆర్థిక మంత్రి సమాధానం ఇస్తారు.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు ఫిబ్రవరి 24, 25, 26 తేదీల్లో నిర్వహిస్తారు. మార్చి 1, 2, 3 తేదీల్లో అసెంబ్లీ ఉండవు. మార్చి 6న అమరావతిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మార్చి 6, 7న బడ్జెట్‌పై మరోసారి చర్చ ఉండనుంది. ఆ తర్వాత అవసరం మేరకు అసెంబ్లీ సమావేశాలను పొడిగించాలా లేదా అనేది నిర్ణయిస్తారు. సభ ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు సమావేశమవుతుంది, ప్రశ్నోత్తరాల సమయం ఉదయం 10 గంటలకు ముగుస్తుంది. ఆ తర్వాత ప్రతిరోజూ జీరో అవర్ ఉంటుంది. గ్రాంట్ల డిమాండ్లపై చర్చలు ఎనిమిది రోజుల పాటు జరుగుతాయి. ఈ సమావేశంలో ఆరు ఆర్డినెన్స్‌లకు కూడా సభ ఆమోదం తెలపనుంది.
ఏఐ ఆధారిత అటెండెన్స్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గురువారం నుంచి ఏఐ ఆధారిత అటెండెన్స్ అమలులో రానుందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. పలు కంపెనీల సీఈవోలు సైతం ప్రస్తుతం కూడా బయోమెట్రిక్ విధానాన్ని అనుసరిస్తున్నారని చెప్పారు. 'పార్లమెంటులోనూ ఈ విధానం ప్రవేశపెట్టేందుకు ఆలోచిస్తున్నారు. సభ్యులు తమ స్థానాల్లో కూర్చుంటేనే హాజరు నమోదు అవుతుంది. ఈసారి సాంస్కృతిక కార్యక్రమాలు అమరావతిలోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తాం.' అని అయ్యన్నపాత్రుడు చెప్పారు.
అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాస సముదాయాలకు ఏప్రిల్ నెలాఖరులో గృహప్రవేశాలు చేస్తామని అయ్యన్నపాత్రుడు అన్నారు. కొత్త అసెంబ్లీ భవన నిర్మాణం ప్లాన్ దేశంలోనే అత్యుత్తమంగా ఉంటుందని చెప్పారు. చుట్టూ నీరు, 250 మీటర్ల ఎత్తులో కొత్త అసెంబ్లీ వ్యూ అత్యద్భుతంగా ఉంటుందన్నారు. 2028 డిసెంబల్ అసెంబ్లీ సమావేశాలు కొత్త భవనంలో జరిగేలా అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో పెట్టుకుని.. పెరగనున్న అసెంబ్లీ, ఎమ్మెల్సీ స్థానాలను దృష్టిలో పెట్టుకుని 300కు పైగా సీటింగ్ కొత్త సభలో ఉంటుందని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


