టెక్నో పెయింట్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా సచిన్ టెండూల్కర్.. ఐపీఓకు హైదరాబాద్ కంపెనీ ప్లాన్!
పెయింట్స్ తయారీ సంస్థ 'టెక్నో పెయింట్స్' తమ బ్రాండ్ అంబాసిడర్‌గా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను నియమించుకుంది. దేశవ్యాప్తంగా విస్తరణ ప్రణాళికకు సచిన్ లాభం చేకూరుస్తారని సంస్థ అభిప్రాయపడుతోంది.
భారత పెయింట్స్ రంగంలో తనదైన ముద్ర వేస్తున్న 'టెక్నో పెయింట్స్ అండ్ కెమికల్స్' ఒక కీలక ప్రకటన చేసింది. 'క్రికెట్ గాడ్', భారతరత్న సచిన్ టెండూల్కర్‌ను తమ సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నట్లు వెల్లడించింది. రాబోయే మూడేళ్ల పాటు సచిన్ ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. ఇప్పటికే ఎనిమిది రాష్ట్రాల్లో విజయవంతంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థ, సచిన్ రాకతో తన బ్రాండ్‌ను దేశవ్యాప్తంగా మరింత బలంగా తీసుకెళ్లాలని భావిస్తోంది.

"ప్రపంచ క్రికెట్ ఐకాన్ సచిన్ టెండూల్కర్‌తో చేతులు కలపడం మాకు దక్కిన గౌరవం. ఈ ఏడాది మేము ఐపీఓకు వెళ్లడంతో పాటు వ్యాపారాన్ని భారీగా విస్తరిస్తున్నాము. మా వృద్ధి ప్రయాణానికి సచిన్ కంటే మెరుగైన పార్ట్‌నర్ మరొకరు ఉండరు," అని టెక్నో పెయింట్స్ చైర్మన్ ఆకూరి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గతంలో ఈ సంస్థకు రెండేళ్ల పాటు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.
త్వరలోనే ఐపీఓ.. రూ. 500 కోట్లు టార్గెట్!
కంపెనీ భవిష్యత్తు ప్రణాళికల గురించి శ్రీనివాస్ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఐపీఓ కోసం డీఆర్‌హెచ్‌పీ ఫైల్ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా సుమారు రూ. 500 కోట్ల నిధులను సమీకరించాలని సంస్థ యోచిస్తోంది.
ఆదాయం విషయంలోనూ టెక్నో పెయింట్స్ దూకుడుగా ఉంది. 2024-25లో రూ. 210 కోట్ల ఆదాయం సాధించిన ఈ సంస్థ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 450 కోట్ల రెవెన్యూ సాధించనున్నట్టు అంచనా వేసింది. 2029-30 నాటికి రూ. 2,000 కోట్ల టర్నోవర్‌ను చేరుకోవడమే తమ లక్ష్యమని శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
అపారమైన అవకాశాలు.. అంతర్జాతీయ విస్తరణ..
ప్రస్తుతం భారత పెయింట్స్ పరిశ్రమ విలువ దాదాపు రూ. 90,000 కోట్లుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా సగటున ఒక వ్యక్తి ఏడాదికి 15 లీటర్ల పెయింట్ వాడుతుంటే, భారత్‌లో అది కేవలం 4.5 లీటర్లు మాత్రమే ఉందని, అందుకే ఈ రంగంలో వృద్ధికి ఎంతో అవకాశం ఉందని శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
కొత్త మార్కెట్లు: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, దిల్లీ వంటి రాష్ట్రాల్లో ఉన్న టెక్నో పెయింట్స్.. ఈ ఏడాది చివరకల్లా తమిళనాడు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలకు విస్తరించనుంది.
గ్లోబల్ ఎంట్రీ: 2026-27 నాటికి మిడిల్ ఈస్ట్ మార్కెట్లోకి అడుగుపెట్టాలని ప్లాన్ చేస్తోంది.
టెక్నో పెయింట్స్ ప్రస్థానం..
- హైదరాబాద్‌కు చెందిన ఈ టెక్నో పెయింట్స్ సంస్థ 2001లో కేవలం 10 మందితో ప్రయాణాన్ని మొదలుపెట్టి, నేడు 450 మందికి పైగా ఉద్యోగులతో వెలుగొందుతోంది.
- పశమైలారం వద్ద అత్యాధునిక తయారీ కేంద్రం, హైదరాబాద్‌లో సొంత రీసెర్చ్ సెంటర్ వంటివి ఈ కంపెనీకి ఉన్నాయి.
- 3,000లకు పైగా షేడ్స్, స్పెషల్ టెక్చర్ ఫినిషింగ్స్ అందిస్తోంది.
- ఇప్పటివరకు 1,250 ప్రాజెక్టులను పూర్తి చేసింది.
- ప్రస్తుతం తెలంగాణలోని 26,065 పాఠశాలలకు రంగులు వేసే పనులను కూడా సంస్థ చేపట్టింది.
అంతర్జాతీయ నాణ్యత, సమయానికి ప్రాజెక్టులను పూర్తి చేయడమే తమను మార్కెట్‌లో టాప్ బ్రాండ్‌గా నిలబెట్టాయని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


