అమరావతిలో లోక్ భవన్, అసెంబ్లీ దర్బార్ హాల్ నిర్మాణం - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మంత్రి మండలి సమావేశం నిర్వహించారు. దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన మంత్రివర్గ సమావేశంలో 44 అజెండా అంశాలకు ఆమోదముద్ర వేశారు. అమరావతిలో లోక్ భవన్, అసెంబ్లీ దర్బార్ హాల్ నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Published on: Dec 11, 2025, 17:07:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన మంత్రివర్గ సమావేశంలో 44 అజెండా అంశాలకు ఆమోదం తెలిపారు. రాజధాని అమరావతిలో లోక్‌భవన్‌, అసెంబ్లీ దర్బార్‌ హాల్‌, గవర్నర్‌ కార్యాలయం, రెండు గెస్ట్‌ హౌస్‌లు, స్టాఫ్‌ క్వార్టర్ల నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రి పార్థసారథి వెల్లడించారు.

ఏపీ కేబినెట్ నిర్ణయాలు
ఏపీ కేబినెట్ నిర్ణయాలు

పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో సమగ్ర నీటి నిర్వహణకు సంబంధించి దాదాపు రూ.9,500 కోట్లతో 506 ప్రాజెక్టులకు పరిపాలన అనుమతులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు 32 శాతం పెరగడంపై కేబినెట్ సంతృప్తిని వ్యక్తం చేసింది. భవిష్యత్తులోనూ రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించాలని కేబినెట్ నిర్ణయించింది.

పత్తి కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు, కపాస్ కిసాన్ యాప్ లోని సాంకేతిక లోపాలను సరిదిద్దాలని మరియు మిర్చి వంటి పంటలకు మెరుగైన మార్కెట్ కల్పించే అంశంపై మంత్రివర్గం చర్చించడం జరిగింది. ​​రాష్ట్రానికి రూ. 20 వేల కోట్లకుపైగా పెట్టుబడులు, సుమారు 56 వేల ఉద్యోగాల కల్పనకు సంబంధించిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.సీఆర్డీఏకు నాబార్డు నుంచి రూ. 7,380.70 కోట్ల రుణం తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది.

సీడ్ యాక్సెస్ రహదారిని 16వ హైవేకి అనుసంధాన పనులకు రూ.532 కోట్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎస్‌ఐపీబీలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గిరిజన సంక్షేమశాఖలో 417 భాషా పండితుల పోస్టులను స్కూల్‌ అసిస్టెంట్‌లుగా పదోన్నతికి ఆమోదముద్ర లభించింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More