ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం అనే మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 28కి పెరిగింది. తుది గెజిట్ నోటిఫికేషన్ రెండు, మూడు రోజుల్లో విడుదల కానుంది. సమావేశంలో పలు కీలక మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యాలయంగా ఉన్న రాయచోటి, కొత్తగా సృష్టించిన మదనపల్లె జిల్లాలో విలీనం అవుతుంది.

రాజంపేట కడప జిల్లాలో కలుస్తుంది. రైల్వే కోడూరు తిరుపతి జిల్లాలో భాగమవుతుంది. గూడూరును తిరుపతి జిల్లా నుండి తిరిగి నెల్లూరు జిల్లాకు కలిపేస్తారు. ఐదు కొత్త రెవెన్యూ డివిజన్లకు కూడా ఆమోదం లభించింది. అనివార్య పరిస్థితుల కారణంగా, విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పునర్వ్యవస్థీకరణ అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా వివరించారు.
ఆదోనిలో మూడు కొత్త మండలాలను సృష్టించాలనే ప్రతిపాదనలో, రెండింటికీ మాత్రమే ఆమోదం లభించింది. నెల్లూరు జిల్లా రెవెన్యూ డివిజన్, డీఎస్పీ అధికార పరిధి వేర్వేరు ప్రదేశాలలో ఉన్నందున చర్చ నడిచింది. నెల్లూరులో పరిపాలనా సమస్యలపై చర్చలు జరిగాయి. 2025లో ఎన్నో సంస్కరణలకు నాందిగా చంద్రబాబు ప్రకటించారు. 2026లో అధికారులు తమ సామర్థ్యాన్ని పెంచుకోవాలని సూచించారు.
రెండు మూడు రోజుల్లో కొత్త జిల్లాలపై గెజిట్ నోటిఫికేషన్ రానుంది. దీనితో జిల్లాల మార్పులు అధికారికంగా అమల్లోకి వస్తాయి. కొత్తగా ఏర్పడిన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు స్థానిక అభివృద్ధి, పాలనా సమన్వయానికి కీలకంగా మారుతాయని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మార్పులు, చేర్పులు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. అన్నమయ్య జిల్లా పేరు అలాగే ఉంటుంది.. అయితే జిల్లా కేంద్రం మాత్రం మదనపల్లె.
కేబినెట్లో 24 అంశాలను చర్చించి ఆమోదం తెలిపారు. క్యాబినెట్ నిర్ణయాలను మంత్రులు అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ వెల్లడించారు. 'సాంఘిక సంక్షేమ శాఖలో రుణాలు తీసుకున్నవారికి ఉపశమనం కల్పించాం. ప్రభుత్వ కార్యాలయాల్లో స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు ఆమోదం. ప్రజల కోరిక మేరకు డివిజన్ల, మండలాలను మార్చాం. పోలవరం పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం.' అని మంత్రులు వెల్లడించారు.
{{/usCountry}}కేబినెట్లో 24 అంశాలను చర్చించి ఆమోదం తెలిపారు. క్యాబినెట్ నిర్ణయాలను మంత్రులు అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ వెల్లడించారు. 'సాంఘిక సంక్షేమ శాఖలో రుణాలు తీసుకున్నవారికి ఉపశమనం కల్పించాం. ప్రభుత్వ కార్యాలయాల్లో స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు ఆమోదం. ప్రజల కోరిక మేరకు డివిజన్ల, మండలాలను మార్చాం. పోలవరం పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం.' అని మంత్రులు వెల్లడించారు.
{{/usCountry}}మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ కల్పించే దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టామని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. మౌలిక వసతుల కోసం సుమారు రూ.మూడు లక్షల కోట్లను ఖర్చు చేస్తున్నామన్నారు. కొప్పర్తి, ఓర్వకల్లుకు పెట్టుబడులు భారీగా వస్తున్నాయన్నారు. మచిలీపట్నం నుంచి హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ వరకు రోడ్డు వెళ్తుందన్నారు. పథకాలకు మహనీయుల పేర్లను పెట్టడంపై మంత్రివర్గంలో చర్చ జరిగిందని సత్యకుమార్ చెప్పారు. విశాఖ ఆసుపత్రి నిర్మాణానికి భూమి కేటాయించింది మంత్రివర్గం.