ఏపీలో కొత్త జిల్లాలకు కేబినెట్ ఆమోదం.. మంత్రివర్గ నిర్ణయాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో మూడు కొత్త జిల్లాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనితోపాటుగా పలు కీలక నిర్ణయాలను మంత్రివర్గం తీసుకుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం అనే మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 28కి పెరిగింది. తుది గెజిట్ నోటిఫికేషన్ రెండు, మూడు రోజుల్లో విడుదల కానుంది. సమావేశంలో పలు కీలక మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యాలయంగా ఉన్న రాయచోటి, కొత్తగా సృష్టించిన మదనపల్లె జిల్లాలో విలీనం అవుతుంది.

రాజంపేట కడప జిల్లాలో కలుస్తుంది. రైల్వే కోడూరు తిరుపతి జిల్లాలో భాగమవుతుంది. గూడూరును తిరుపతి జిల్లా నుండి తిరిగి నెల్లూరు జిల్లాకు కలిపేస్తారు. ఐదు కొత్త రెవెన్యూ డివిజన్లకు కూడా ఆమోదం లభించింది. అనివార్య పరిస్థితుల కారణంగా, విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పునర్వ్యవస్థీకరణ అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా వివరించారు.
ఆదోనిలో మూడు కొత్త మండలాలను సృష్టించాలనే ప్రతిపాదనలో, రెండింటికీ మాత్రమే ఆమోదం లభించింది. నెల్లూరు జిల్లా రెవెన్యూ డివిజన్, డీఎస్పీ అధికార పరిధి వేర్వేరు ప్రదేశాలలో ఉన్నందున చర్చ నడిచింది. నెల్లూరులో పరిపాలనా సమస్యలపై చర్చలు జరిగాయి. 2025లో ఎన్నో సంస్కరణలకు నాందిగా చంద్రబాబు ప్రకటించారు. 2026లో అధికారులు తమ సామర్థ్యాన్ని పెంచుకోవాలని సూచించారు.
రెండు మూడు రోజుల్లో కొత్త జిల్లాలపై గెజిట్ నోటిఫికేషన్ రానుంది. దీనితో జిల్లాల మార్పులు అధికారికంగా అమల్లోకి వస్తాయి. కొత్తగా ఏర్పడిన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు స్థానిక అభివృద్ధి, పాలనా సమన్వయానికి కీలకంగా మారుతాయని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మార్పులు, చేర్పులు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. అన్నమయ్య జిల్లా పేరు అలాగే ఉంటుంది.. అయితే జిల్లా కేంద్రం మాత్రం మదనపల్లె.
కేబినెట్‌లో 24 అంశాలను చర్చించి ఆమోదం తెలిపారు. క్యాబినెట్ నిర్ణయాలను మంత్రులు అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ వెల్లడించారు. 'సాంఘిక సంక్షేమ శాఖలో రుణాలు తీసుకున్నవారికి ఉపశమనం కల్పించాం. ప్రభుత్వ కార్యాలయాల్లో స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు ఆమోదం. ప్రజల కోరిక మేరకు డివిజన్ల, మండలాలను మార్చాం. పోలవరం పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం.' అని మంత్రులు వెల్లడించారు.
మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ కల్పించే దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టామని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. మౌలిక వసతుల కోసం సుమారు రూ.మూడు లక్షల కోట్లను ఖర్చు చేస్తున్నామన్నారు. కొప్పర్తి, ఓర్వకల్లుకు పెట్టుబడులు భారీగా వస్తున్నాయన్నారు. మచిలీపట్నం నుంచి హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ వరకు రోడ్డు వెళ్తుందన్నారు. పథకాలకు మహనీయుల పేర్లను పెట్టడంపై మంత్రివర్గంలో చర్చ జరిగిందని సత్యకుమార్ చెప్పారు. విశాఖ ఆసుపత్రి నిర్మాణానికి భూమి కేటాయించింది మంత్రివర్గం.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


