...
...
Next Story

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు… ప్రత్యక్ష పద్ధతిలో మేయర్ల ఎన్నిక, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే

AP Cabinet Decisions : ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు గ్రామీణ ప్రాంతాల్లో 34 శాతం, పట్టణాల్లో 33.13% రిజర్వేషన్లు కల్పించనున్నారు.

Published on: Aug 18, 2026, 14:57:19 IST
Advertisement

AP Cabinet Decisions : ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలకమైన మరియు ప్రాధాన్యత కలిగిన నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. మొత్తం 57 అజెండా అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన మంత్రివర్గం…. వాటికి ఆమోదం తెలుపుతూ పచ్చజెండా ఊపింది. ఈ భేటీలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది.

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు….

ఏపీ కేబినెట్ భేటీలో నిర్ణయాలు
ఏపీ కేబినెట్ భేటీలో నిర్ణయాలు

రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు (బీసీలకు) తగిన ప్రాతినిధ్యం కల్పించే దిశగా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. బీసీ రిజర్వేషన్లను పునరుద్ధరిస్తూ…. వాటిని చట్టబద్ధంగా అమలు చేసేందుకు చర్యలు వేగవంతం చేయాలని నిర్ణయించింది.

ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని (రూరల్) స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అదేవిధంగా, పట్టణ ప్రాంతాల్లో (అర్బన్) 33.13 శాతం రిజర్వేషన్లు కల్పించాలని స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. బీసీ సామాజిక వర్గాలకు రాజకీయంగా సరైన గుర్తింపు, అధికారంలో భాగస్వామ్యం కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

రాష్ట్రంలో చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఉన్న అనిశ్చితికి కేబినెట్ తెరదించింది. రాబోయే అక్టోబర్ నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తిస్థాయిలో నిర్వహించాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని మరియు రిజర్వేషన్ల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది.

ప్రత్యక్ష పద్ధతిలో మేయర్లు, చైర్మన్ల ఎన్నిక…

అంతేకాకుండా, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సంఖ్య, పాలనా వ్యవస్థపై స్పష్టతనిస్తూ ఇకపై ప్రతి మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్‌లో ఒక్కరే డిప్యూటీ మేయర్ లేదా వైస్ చైర్మన్ ఉండేలా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నూతన విధానాలు రాబోయే అక్టోబర్ ఎన్నికల నుంచే అమలులోకి రానున్నాయి.

మరోవైపు కర్నూలులో అగస్త్య గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఇక విశాఖలో అక్షత్‌ గ్రీన్‌టెక్‌ సోలార్‌ సెల్‌, మాడ్యూల్‌ ప్లాంట్‌, డేటా సెంటర్ల ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తిరుపతి, సూర్యలంక, కేశరపల్లి, కాకినాడలో స్టార్‌ హోటళ్ల ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks