...
...
Next Story

గుడ్‌న్యూస్.. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల్ని రెండేళ్ల తర్వాత అమ్ముకోవచ్చు

AP Cabinet Decisions : సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలను మంత్రి పార్ధసారథి వెల్లడించారు.

Published on: Apr 11, 2026, 06:14:37 IST
Advertisement

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం.. రాష్ట్రంలో పారిశ్రామిక, సాంకేతిక వృద్ధికి చేస్తున్న కృషిని బలోపేతం చేస్తూ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) 16వ సమావేశంలో ఆమోదించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి కొలుసు పార్థసారథి, సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ రూ.9.36 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించిందన్నారు. తద్వారా దాదాపు 9.62 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించిందని తెలిపారు.

ఏపీ కేబినెట్ సమావేశం
ఏపీ కేబినెట్ సమావేశం

ముఖ్యమైన నిర్ణయాలలో భాగంగా విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా ప్రాజెక్టుల ప్రతిపాదనలకు, అలాగే విశాఖపట్నంలో కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కోసం సీటెక్‌కు భూమి కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

శ్రీ సత్యసాయి జిల్లాలో అవుట్‌సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్టింగ్ (OSAT) కేంద్రానికి ఆమోదం లభించగా, ఫ్యాబ్రికేషన్ యూనిట్ కోసం ఆర్ఆర్ ఎలక్ట్రానిక్స్‌కు 60 ఎకరాల భూమిని కేటాయించారు. సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ రంగం రూ.18,210 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షిస్తూ, ఒక ప్రధాన వృద్ధి చోదకంగా ఆవిర్భవించింది.

ముఖ్యంగా, ఆర్‌ఆర్‌పీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ శ్రీ సత్యసాయి జిల్లాలో ఒక భారీ సెమీకండక్టర్, ఓశాట్ (OSAT) కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది.

సి-డాక్ అభ్యర్థన మేరకు అమరావతి క్వాంటం వ్యాలీలో క్వాంటం ఏఐ గ్లోబల్ వంటి సంస్థలకు కేంద్రాలను ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) వంటి ప్రముఖ సంస్థలు తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయని మంత్రి తెలిపారు. ఇన్ఫోసిస్ విశాఖపట్నంలో కొత్త క్యాంపస్‌ను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక వేస్తోందని, దీని ద్వారా సుమారు 7,000 ఉద్యోగాలు వస్తాయని వెల్లడించారు.

నిషేధిత ఆస్తులుగా నోటిపై చేసిన యూఎల్‌సీ భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తు గడువును 2026 డిసెంబర్ 31 వరకు పొడిగించే ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించింది.

పేదలకు ప్రభుత్వం పట్టా మంజూరు తేదీ నుంచి పదేళ్ల తర్వాత అన్యాక్రాంత హక్కులు లభిస్తాయనే నిబంధన అమల్లో ఉంది. అయితే ఇక మీదట దీన్ని రెండేళ్ల తర్వాత అని మార్చనున్నారు. ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాల్ని రెండేళ్ల తర్వాత అమ్ముకోవచ్చు. 2024లో తీసుకున్న స్థలం ఇప్పుడు అమ్ముకునే ఛాన్స్ దొరుకుతుంది.

ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చట్టాన్ని సవరించే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం దొరికింది. కమిషన్ స్థానంలో ఫీజు నియంత్రణ, పర్యవేక్షణ కమిటీగా మార్చింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks