Sleeper Buses Ban : ఏపీలో ప్రైవేట్ స్లీపర్ బస్సులు నిషేధిస్తారా? ప్రభుత్వం ఏమనుకుంటోంది?

Sleeper Buses Ban : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ స్లీపర్ బస్సులను నిషేధించే విషయాన్ని పరిశీలిస్తోందని తెలుస్తోంది. బ్యాన్ చేస్తే ఎలా ఉంటుందనే విషయంపై అధికారులు చర్చలు చేస్తున్నారు.

Published on: Apr 9, 2026, 07:53:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీలో వరుసగా జరుగుతున్న ఘోర ప్రమాదాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ స్లీపర్ బస్సులను నిషేధించాలని యోచిస్తోంది. అధికారులు ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు.

ఏపీలో ప్రైవేట్ స్లీపర్ బస్సులు నిషేధిస్తారా?
ఏపీలో ప్రైవేట్ స్లీపర్ బస్సులు నిషేధిస్తారా?

బస్సు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఇటీవల సమావేశమైంది. ఈ భేటీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, హోం మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఈ సమావేశం తర్వాత ప్రైవేట్ స్లీపర్ బస్సుల నిషేధం చర్చ తెరపైకి వచ్చింది.

ప్రధాన భద్రతా లోపాలు

ప్రస్తుతం రోడ్లపై తిరుగుతున్న చాలా ప్రైవేట్ స్లీపర్ బస్సులు కంపెనీ నుంచి తయారైనవి కావని, సాధారణ బస్సులను స్లీపర్ కోచ్‌లుగా మార్చినవని అధికారులు కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. వీటిలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ కారణంగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి వస్తుంది. పాత వాహనాలకు మాడిఫికేషన్ చేసి రోడ్లపు చాలా బస్సులను తిప్పుతున్నారు.

  • సరైన అత్యవసర ద్వారాలు (Emergency Exits) లేకపోవడం.
  • గాలి వెలుతురు (Ventilation) సరిగ్గా లేకపోవడం.
  • నిర్మాణపరంగా భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వంటి లోపాలు ఉన్నట్లు గుర్తించారు.

మొదటి దశలో, కంపెనీలలో కాకుండా బయట మార్పులు చేసిన (Non-factory-built) స్లీపర్ బస్సులను నిషేధించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని ఇటీవల మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి అన్నారు. అసురక్షిత స్లీపర్ కోచ్‌ల కార్యకలాపాలను నియంత్రించడానికి లేదా పూర్తిగా నిషేధించడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అనుమతులు కోరుతామని స్పష్టం చేస్తున్నారు.

స్లీపర్ బస్సుల నిషేధంపై నిర్ణయం తీసుకునేలోపే, ప్రయాణికుల భద్రత కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నది.

సమయ నియంత్రణ

బస్సు బయలుదేరే చోటు నుంచి గమ్యస్థానానికి చేరుకోవడానికి నిర్ణీత సమయాన్ని కేటాయిస్తారు. నిర్ణీత సమయం కంటే ముందే బస్సు వస్తే, అతివేగంగా నడిపినట్లు పరిగణించి ఆ బస్సును నగరంలోకి అనుమతించరు.

ఇద్దరు డ్రైవర్లు తప్పనిసరి

300 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే ప్రైవేట్ బస్సుల్లో తప్పనిసరిగా ఇద్దరు డ్రైవర్లు ఉండాలి. ఎందుకంటే.. చాలా ప్రైవేట్ ట్రావెల్స్ ఖర్చు తగ్గించుకోవడానికి ఒకే డ్రైవర్ మీద ఆధారపడుతున్నాయి. అంతేకాదు సరైన అర్హతలు లేని వ్యక్తులను డ్రైవర్లుగా నియమించుకుంటున్నాయి. ఇలాంటి విషయాలు కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. ఇప్పటికే ప్రైవేట్ ట్రావెల్స్‌లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More