టైరు పేలి, లారీని ఢీకొని నంద్యాల జిల్లాలో కాలిపోయిన ప్రైవేట్ బస్సు.. ముగ్గురు మృతి
నంద్యాల జిల్లాలో అర్ధరాత్రిపూట దారుణమైన ఘటన జరిగింది. ప్రైవేట్ బస్సు టైరు పేలి.. బస్సు మంటల్లో కాలిపోయింది. ఈ ఘటలో ముగ్గురు మృతి చెందారు.
ఆంధ్రప్రదేశ్‌లో వరుస బస్సు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఘటనలు మరిచిపోకముందే.. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం శిరివెళ్లమెట్ట దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో బస్సులో ఉన్నవారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పూర్తి వివరాళ్లోకి వెళ్తే..

నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు వెళ్తోంది. ఇందులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత శిరివెళ్లమెట్ట దగ్గరకు బస్సు వచ్చింది. ఈ సమయంలో బస్సు టైరు పేలింది. అంతేకాదు అదుపుతప్పి డివైడర్ దాటి అవతలివైపు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.
ఈ ప్రమాదం జరిగిన వెంటనే బస్సుకు మంటలు వ్యాపించాయి. ఆ దారిలో వెళ్తున్న డీసీఎం డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యారు. బస్సు అద్దాలను పగలగొట్టారు. దీంతో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. కిటికీల్లో నుంచి దూకేశారు. దీనితో కొంతమంది ప్రయాణికులకు స్వల్పగాయాలు అయ్యాయి. మంటలు బాగా వ్యాపించాయి. బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్, క్లీనర్ మంటల్లో కాలిపోయారు. గుర్తుపట్టలేనంతగా అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెంటనే వచ్చారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు.
గతంలో కర్నూలులో
హైదరాబాద్-బెంగళూరు ప్రైవేట్ ట్రావెల్ బస్సు కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద అక్టోబర్ 2025లో కాలి బూడిదైన విషయం తెలిసిందే. ఇందులో ప్రయాణిస్తున్న చాలా మంది మరణించారు. 19 మంది సజీవదహనం అయ్యారు. డ్రైవర్ బస్సు ప్రయాణికుల్లో 39 మంది పెద్దలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనమైంది.
హైవేపై వెళ్తున్న ప్రైవేట్ బస్సు రోడ్డు మీద ఉన్న బైక్‌ను ఢీకొట్టింది. చాలా దూరం లాక్కెళ్లింది. కాసేపటికి మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 19 మంది మరణించారు. చాలా మందికి గాయాలు అయ్యాయి. డీఎన్‌ఏ పరీక్షల తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.
బైక్‌పై వెళ్తున్న శివశంకర్, ఎర్రిస్వామి మద్యం మత్తులో ఉన్నారు. చిన్నటేకూరు సమీపంలో శివశంకర్ బైక్ నడుపుతూ స్కిడ్ అయి రోడ్డుకు కుడివైపున ఉన్న డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో శివశంకర్ అక్కడికక్కడే చనిపోయాడు. రోడ్డు మధ్యలో పడి ఉన్న అతడిని పక్కకు తీశాడు ఎర్రిస్వామి. బైక్ తీద్దామనుకునే సమయంలో బస్సు వచ్చి ఢీకొట్టి లాక్కెళ్లింది. దీంతో బస్సుకు మంటలు వ్యాపించి.. పెద్ద ప్రమాదం జరిగింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


