ప్రతీ ఒక్కరికీ సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తోన్న కూటమి ప్రభుత్వం మరోసారి సామూహిక గృహప్రవేశాల ద్వారా పేదలకు ఇళ్ల పంపిణీ చేపట్టనుంది. రెండో విడత ఇళ్ల పంపిణీలో భాగంగా ఇవాళ(సోమవారం) రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో 2.5 లక్షల గృహ ప్రవేశాలను ఘనంగా నిర్వహించనుంది.
లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు…

తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట నియోజకవర్గంలో సోమవారం జరిగే సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయిస్తారు.
కూటమి అధికారంలోకి వచ్చాక ఈ 21 నెలలో రెండోసారి ప్రభుత్వం ఇళ్ల పంపిణీ చేస్తోంది. గతేడాది నవంబర్‌లో రాయచోటి నుంచి 3 లక్షల ఇళ్లను రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు అప్పగించింది. రెండో విడతలో భాగంగా సూళ్లూరుపేట నియోజకవర్గం, నాయుడపేట మండలం, పుదూరు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 1 లక్ష టిడ్కో ఇళ్లతో పాటు మరో 1.50 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు ముఖ్యమంత్రి పంపిణీ చేస్తారు.
ఈ కార్యక్రమం అనంతరం పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం చేపట్టిన పీ 4 కార్యక్రమం మొదలుపెట్టి ఏడాదవుతున్న సందర్భంగా తిరుపతిలో నిర్వహించే వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఈ 2.50 లక్షల గృహాల్లో.. 1.42 లక్షలు కాలనీల్లో చేపట్టిన గృహాలు కాగా.. మిగిలిన 1.08 లక్షలు టిడ్కో ఇళ్లు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది డిసెంబర్ నాటికి టిడ్కో గృహ సముదాయాల్లో చేపట్టిన 2.62 లక్షల గృహాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.
సీఎం చంద్రబాబు పర్యటన వివరాలు…
ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం 10 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి 11.50 గంటలకు పుదూరుకు చేరుకుంటారు. 11.55 గంటలకు లబ్ధిదారులతో టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశాలు చేయిస్తారు. అనంతరం లబ్ధిదారులతో ముఖ్యమంత్రి ముచ్చటిస్తారు.
{{/usCountry}}ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం 10 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి 11.50 గంటలకు పుదూరుకు చేరుకుంటారు. 11.55 గంటలకు లబ్ధిదారులతో టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశాలు చేయిస్తారు. అనంతరం లబ్ధిదారులతో ముఖ్యమంత్రి ముచ్చటిస్తారు.
{{/usCountry}}మధ్యాహ్నం 12.40 గంటలకు ప్రజావేదిక సభలో పాల్గొంటారు. 02.40 గంటలకు సూళ్లూరుపేట నియోజకవర్గ కార్యకర్తలు, నేతలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం తర్వాత సాయంత్రం 04.35 గంటలకు తిరుపతి చేరుకుంటారు. 04.45 గంటలకు శ్రీపద్మావతీ మహిళా విశ్వవిద్యాలయంలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించే పీ4 వార్షికోత్సవ సభలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం ముగించుకుని రాత్రి 08.50 గంటలకు అమరావతి చేరుకుంటారు.
ఏపీ టౌన్ షిప్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APTIDCO) ఆధ్వర్యంలో ఈ ఇండ్ల నిర్మాణం జరిగింది. ఈ మెగా హౌసింగ్ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల పరిధిలో టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయనున్నారు.