ఆ 1000 కుటుంబాలకు 15 రోజుల్లో తాడ్వాయి వద్ద ఇళ్ల స్థలాలు.. పట్టాల పంపిణీ!
పోలవరం ప్రాజెక్టు పునరావాస ప్రక్రియపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నిర్వాసితులైన కుటుంబాలను తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
పోలవరం ప్రాజెక్టు పునరావాస ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. పోలవరం జిల్లాలోని ముంపునకు గురయ్యే మండలాలైన వీఆర్‌పురం, కూనవరం, చింతూరు మండలాల నుంచి నిర్వాసితులైన కుటుంబాలను తరలించేందుకు అధికారులు ఏర్పా్ట్లు చేస్తున్నారు.

మొదటి దశలో 1,000 కుటుంబాలను ఏలూరు జిల్లాలోని తాడ్వాయికి తరలిస్తామని అధికారులు ప్రకటించారు. అక్కడ ప్రస్తుతం స్థల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రాబోయే రెండు వారాల్లో నిర్వాసిత కుటుంబాలకు 1,000 ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేయడానికి ప్రతిపాదనలు రూపొందించినట్టుగా సమాచారం. 41.15(బి) కాంటూర్ స్థాయి కిందకు వచ్చే కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాల్లో ముంపు ప్రభావం గణనీయంగా ఉంది.
ఈ మూడు మండలాల్లో దశలవారీగా తరలింపు కోసం మొత్తం 14,000 కుటుంబాలను గుర్తించారు. అభ్యంతరాలు, ధృవీకరణ సమస్యల కారణంగా దాదాపు 4,000 కేసులు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. కూనవరం మండలంలోని తొమ్మిది గ్రామాల నుండి 4,355 కుటుంబాలు, వీఆర్‌పురం మండలంలోని 16 గ్రామాల నుండి 5,795 కుటుంబాలు, చింతూరు మండలంలోని ఆరు గ్రామాల నుండి 3,667 కుటుంబాలు ఉన్నాయి. వివాదాస్పద కేసులను తదుపరి పరిశీలన కోసం పక్కన పెట్టి, రికార్డులు స్పష్టంగా ఉన్న కుటుంబాలను తరలించాలని అధికారులు నిర్ణయించారు. చింతూరు, వీఆర్‌పురం మండలాల్లో అధికారులు విస్తృతంగా పర్యటించారు.
మరోవైపు పోలవరం ప్రాజెక్టు భద్రత, ముఖ్యంగా డయాఫ్రమ్ వాల్ సమగ్రతను ఆడిట్ చేయడానికి వెంటనే ఒక స్వతంత్ర అంతర్జాతీయ సమీక్ష ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలని సెంటర్ ఫర్ లిబర్టీ అనే సంస్థ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర జల కమిషన్(సీడబ్ల్యూసీ), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది.
డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించిన అన్ని రోజువారీ కాంక్రీట్ పోర్ లాగ్‌లు, నాణ్యత నియంత్రణ నివేదికలు, నిర్మాణ సమగ్రతను అంచనా వేయడానికి నిర్వహించే క్రాస్-వాల్ సోనిక్ లాగింగ్(సీఎస్ఎల్) పరీక్షల ఫలితాలను బహిరంగంగా ఉంచాలని సెంటర్ ఫర్ లిబర్టీ డిమాండ్ చేసింది.
గ్యాప్-Iలో ఫౌండేషన్ ట్రెంచ్ స్థాయిలను 23 మీటర్ల నుండి 24 మీటర్లకు ఆమోదించారని, ఎత్తుకు తగిన సమర్థన లేదా ఆమోదం లేకుండా మార్చడం సరికాదని వెల్లడించింది. ఇటువంటి ఏకపక్ష మార్పులు ఆనకట్ట పునాది స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయని వాదించింది. ఇంజనీరింగ్ ఉల్లంఘనలను కొనసాగించడం వల్ల దిగువ జనాభా ప్రమాదంలో పడుతుందని సెంటర్ ఫర్ లిబర్డీ హెచ్చరించింది. లేవనెత్తిన అంశాలను వెంటనే పరిష్కరించకపోతే కోర్టు పర్యవేక్షణలో భద్రతా ఆడిట్ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


