ఏలూరు అత్యాచారం.. నిందితులను రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లిన పోలీసులు

ఏలూరు అత్యాచారం కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లారు.

Published on: Dec 09, 2025 10:54 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇటీవల సంచలనం సృష్టించిన ఏలూరు అత్యాచారం కేసులో నిందితులను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. సస్పెక్ట్ షీటర్లు పులిగడ్డ జగదీష్ బాబు, లావేటి భవానీ కుమార్‌తో పాటు వారికి సహాయం చేసిన ఆకేటి ధనుష్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు నిందితులను టూ-టౌన్ పోలీస్ స్టేషన్ నుండి కోర్టు వరకు వీధుల గుండా జనాలు చూస్తుండగా నడిపిస్తూ తీసుకెళ్లారు. విచారణ తర్వాత న్యాయమూర్తి వారికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు ఆదేశించారు. ఆ తర్వాత వారిని జిల్లా జైలుకు తరలించారు.

ఏలూరు అత్యాచార నిందితులను నడిపించుకుంటూ తీసుకెళ్లిన పోలీసులు
ఏలూరు అత్యాచార నిందితులను నడిపించుకుంటూ తీసుకెళ్లిన పోలీసులు

నేరస్థులలో భయాన్ని కలిగించడం, తీవ్రమైన నేరాలపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నిరూపించేందుకు ఇలా నడిపించికుంటూ తీసుకెళ్లామని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రావణ్ కుమార్ అన్నారు. ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకున్నామని, నిందితులు చట్టం ప్రకారం కఠినమైన శిక్షను ఎదుర్కొంటారని అన్నారు. నేరస్థుల్లో భయం పుట్టించేందుకు ఇలా బహిరంగంగా నడిపిస్తూ తీసుకెళ్లామన్నారు.

ఈ కేసుకు సంబంధించిన వివరాళ్లోకి వెళ్తే.. ఏలూరు జిల్లా కేంద్రంలో యువతిపై అత్యాచారం జరిగింది. విజయవాడ నిడమానూరు ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయిన ఏలూరుకు చెందిన మరో యువతితో ఫ్రెండ్‌షిప్ కుదిరింది. కొన్ని రోజుల క్రితం ఇద్దరూ కలిసి తిరుపతికి వెళ్లి వచ్చారు. మరికొన్ని రోజుల తర్వాత అంటే నవంబర్ 28వ తేదీన విజయవాడ యువతి ఏలూరుకి చెందిన యువతి ఇంటికి వచ్చింది.

అయితే డిసెంబర్ 2వ తేదీన ఏలూరులోనే ఇద్దరు యువతులు ఉన్నారు. ఏలూరు అమ్మాయి తల్లి.. ద్వారకతిరుమల వెళ్లడంతో యువతులే ఇంట్లో ఉన్నారు. అదే రాత్రి సమయంలో పులిగడ్డ జగదీశ్ బాబు, లావేటి భవానీ కుమార్ మద్యం సేవించి.. ఆ ఇంటికి వచ్చి తలుపులు కొట్టారు. అమ్మాయిలు ఇద్దరు భయపడి తలుపులు తీయలేదు. కాసేపటికి రాళ్లు విసరడంతో తలుపులు తీశారు. ఇంట్లోకి వచ్చిన జగదీశ్.. విజయవాడకు చెందిన యువతిని బలవంతంగా బయటకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అయితే అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఏలూరు యువతిని భవానీ కుమార్ అడ్డుకున్నాడు.

ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించడంతో ఇద్దరు యువతలు సైలెంట్ అయిపోయారు. మళ్లీ కాసేపటి తర్వాత వచ్చి.. అత్యాచార బాధితురాలిని దారుణంగా కొట్టారు. భయపడిపోయిన బాధితురాలు సమీపంలోని ఏలూరు టూటౌన్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసింది.

బాధితురాలని వెంటనే చికిత్స, వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు పోలీసులు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు యువకులతోపాటుగా ఆ రోజు ఘటన స్థలంలో ఉన్న ధనుష్ అనే వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశారు. తాజాగా వారిని నడిరోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More