గుంటూరు జిల్లా తుళ్లూరు మండల పరిధిలో(రాజధాని స్మృతి వనంలో) పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ నెల 16వ తేదీన పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా 58 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ప్రారంభించనున్నారు. సీఎం చేతుల మీదుగా ఆవిష్కరిస్తారని మంత్రి సవిత తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆమె వెల్లడించారు.
58 అడుగుల ఎత్తుతో…

అమరజీవి పొట్టి శ్రీరాముల ప్రాణ త్యాగ ఫలితం భావితరాలకు తెలియజేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్యూఎస్ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. పొట్టి శ్రీరాముల 58 రోజుల అమరణ దీక్షకు గుర్తుగా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. స్మృతి వనంలో ఏర్పాటు చేస్తున్న ఆయన విగ్రహ పనులను శనివారం మంత్రి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… రాజధాని అమరావతిలో 6.8 ఎకరాల్లో స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్ పేరుతో అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతి వనం ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్మృతి వనంలో ఆయన కాంస్య విగ్రహాన్ని అమరజీవి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తోందన్నారు. అమరజీవి 58 రోజుల అమరణ దీక్షకు గుర్తుగా 58 అడుగుల ఎత్తైన ఆయన కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తున్నారన్నారు.
ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు ఆశయాలను, త్యాగాన్ని భవిష్యత్ తరాలకు అందించడమే స్మృతి వనం లక్ష్యమని మంత్రి సవిత వివరించారు. ఈ నెల 16న అమరజీవి 125వ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఆవిష్కరణ ఉంటుందని పేర్కన్నారు.
ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, పలువురు మంత్రులు హాజరవుతారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు కట్టుబడి ఉన్నారన్నారని మంత్రి సవిత తెలిపారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ చేసిన రోజును రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామన్నారు. వాసవీ మాత పేరుతో ఆమె జన్మంచిన పెనుగొండ గ్రామాన్ని వాసవీ పెనుగొండగా మార్చామని మంత్రి సవిత తెలిపారు.
{{/usCountry}}ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, పలువురు మంత్రులు హాజరవుతారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు కట్టుబడి ఉన్నారన్నారని మంత్రి సవిత తెలిపారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ చేసిన రోజును రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామన్నారు. వాసవీ మాత పేరుతో ఆమె జన్మంచిన పెనుగొండ గ్రామాన్ని వాసవీ పెనుగొండగా మార్చామని మంత్రి సవిత తెలిపారు.
{{/usCountry}}