APCRDA : రాజధాని రైతులకు ఈ-లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు
రాజధాని అమరావతి రైతులకు ఇ-లాటరీ ద్వారా 115 ప్లాట్లను కేటాయించారు. నిబంధనల ప్రకారం పూర్తి పారదర్శకంగా ప్లాట్లను కేటాయించినట్లు అధికారులు ప్రకటించారు.
రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు ఇ-లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు జరిగింది. రాయపూడిలోని సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో పూర్తి పారదర్శకంగా నిబంధనల ప్రకారం అధికారులు లాటరీ ప్రక్రియ పూర్తి చేసారు. మొత్తం 16 సీఆర్డీఏ యూనిట్ల పరిధిలోని గ్రామాలకు సంబంధించి 145 ప్లాట్లు కేటాయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

అయితే వీటిలో 15 ప్లాట్లకు సంబంధించిన కొంతమంది రైతులు గురువారం సాయంత్రం తమకు ప్రస్తుతానికి ప్లాట్ల కేటాయింపు వాయిదావేయాలని కోరారు. వీటితో పాటు శుక్రవారం(ఈరోజు)ఉదయం లాటరీ ప్రక్రియ ప్రారంభానికి ముందు సీఆర్డీఏ కార్యాలయంలో అందుబాటులో ఉంచిన లేఅవుట్ పరిశీలించిన తర్వాత మరో 15 ప్లాట్లకు చెందిన రైతులు కూడా వాయిదావేయాలని కోరారు.ఈ మొత్తం 30 ప్లాట్లను మినహాయించి మిగిలిన 115 ప్లాట్లను లాటరీ ద్వారా రైతులకు కేటాయించారు.
రైతులకు కేటాయించిన ప్లాట్లలో ఎక్కడా రోడ్డు శూల లేకుండా...అలాగే సీఆర్డీఏకు భూమి ఇవ్వని రైతుల ప్లాట్లలో ఎక్కడా కేటాయించలేదని సీఆర్డీఏ అధికారులు స్పష్టం చేశారు. అయితే కొంతమంది దక్షిణపు ముఖం ఉన్న ప్లాట్లను తీసుకోవడానికి అంగీకరించడం లేదని చెప్పారు. కానీ దక్షిణపు ముఖం ప్లాట్లు రోడ్డు శూల ప్లాట్లుగా పరిగణించకూడదని,గతంలో కూడా ఇదే విధంగా ప్లాట్లు కేటాయించామని అధికారులు తెలిపారు.
మరోవైపు ప్రస్తుత పరిస్థితిలో కొన్ని ప్లాట్లు పల్లపు ప్రాంతంలో ఉన్నవని,సమాధులు దగ్గరగా ఉన్న ప్రాంతంలో కేటాయిస్తున్నారని కొంతమంది రైతులు తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారని అధికారులు చెప్పారు.ఇలాంటి ప్లాట్లను రిటర్నబుల్ ప్లాట్ లేఅవుట్ నిబంధనల ప్రకారం పూర్తిగా అభివృద్ది చేసి ఇస్తామని సీఆర్డీఏ అధికారులు తెలిపారు.
గ్రామాల వారీగా ప్లాట్ల కేటాయింపు వివరాలు…
- కురగల్లు - 1&2 - 5
- వెలగపూడి - 10
- మందడం -1&2 -15
- నిడమర్రు - 1&2 - 58
- పెనుమాక - 6
- నెక్కల్లు - 1
- అనంతవరం -1
- నేలపాడు - 2
- దొండపాడు -1
- లింగాయపాలెం -6
- మల్కాపురం - 10
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

