రాజధాని ప్రాంతంలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం - ఈనెల 16న ఆవిష్కరణ
రాజధాని స్మృతి వనంలో ఈ నెల 16న పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. 58 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహాన్ని సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఆవిష్కరిస్తారు.
గుంటూరు జిల్లా తుళ్లూరు మండల పరిధిలో(రాజధాని స్మృతి వనంలో) పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ నెల 16వ తేదీన పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా 58 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ప్రారంభించనున్నారు. సీఎం చేతుల మీదుగా ఆవిష్కరిస్తారని మంత్రి సవిత తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆమె వెల్లడించారు.

58 అడుగుల ఎత్తుతో…
అమరజీవి పొట్టి శ్రీరాముల ప్రాణ త్యాగ ఫలితం భావితరాలకు తెలియజేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్యూఎస్ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. పొట్టి శ్రీరాముల 58 రోజుల అమరణ దీక్షకు గుర్తుగా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. స్మృతి వనంలో ఏర్పాటు చేస్తున్న ఆయన విగ్రహ పనులను శనివారం మంత్రి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… రాజధాని అమరావతిలో 6.8 ఎకరాల్లో స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్ పేరుతో అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతి వనం ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్మృతి వనంలో ఆయన కాంస్య విగ్రహాన్ని అమరజీవి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తోందన్నారు. అమరజీవి 58 రోజుల అమరణ దీక్షకు గుర్తుగా 58 అడుగుల ఎత్తైన ఆయన కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తున్నారన్నారు.
ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు ఆశయాలను, త్యాగాన్ని భవిష్యత్ తరాలకు అందించడమే స్మృతి వనం లక్ష్యమని మంత్రి సవిత వివరించారు. ఈ నెల 16న అమరజీవి 125వ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఆవిష్కరణ ఉంటుందని పేర్కన్నారు.
ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, పలువురు మంత్రులు హాజరవుతారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు కట్టుబడి ఉన్నారన్నారని మంత్రి సవిత తెలిపారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ చేసిన రోజును రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామన్నారు. వాసవీ మాత పేరుతో ఆమె జన్మంచిన పెనుగొండ గ్రామాన్ని వాసవీ పెనుగొండగా మార్చామని మంత్రి సవిత తెలిపారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

