...
...
Next Story

రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలి - సీఎం చంద్రబాబు

వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ఖరీఫ్ సాగు, రబీ ప్రణాళిక, ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలపై సమీక్షలో చర్చించారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల్లో గ్రాస్ వాల్యూ అడిషన్ పై దిశా నిర్దేశం చేశారు.

Published on: Oct 9, 2025, 16:53:51 IST
By , Andhrapradesh
Prefer HTon Google
Advertisement

వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. రైతు సేవా కేంద్రాలను రీ-ఓరియంటేషన్ చేసేలా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఆధారపడిన రైతులకు సేవలందించేలా రైతు సేవా కేంద్రాలను తీర్చిదిద్దాలన్నారు.

సేంద్రీయంపై అవగాహన పెంచాలి - సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు సమీక్ష
సీఎం చంద్రబాబు సమీక్ష

రైతులకు వివిధ రకాల ప్రభుత్వ సేవలు అందించే విషయంలో ఆర్ఎస్కేలే కీలక పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. మంచి పోషక విలువలు అందించటం ద్వారా భూసారం పెంచాలని… దాని ద్వారా ఉత్పాదకత పెంచాలన్నారు.

2026 ఖరీఫ్ సీజన్లో సేంద్రీయ సాగు చేసేలా, రసాయన ఎరువుల వినియోగం తగ్గించేలా రైతుల్లో అవగాహన పెంచాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రకృతి సేద్యం ద్వారా పర్యావరణంతో పాటు ఆరోగ్యపరంగా, ఆర్ధికంగా జరిగే ప్రయోజనాలు రైతులకు వివరించాలని పేర్కొన్నారు. ఎలాంటి మార్పులు జరగాలన్నా... క్షేత్రస్థాయిలో ఉండేవారికి పూర్తి స్థాయి అవగాహన ఉండేలా చూడాలన్నారు. భూసారం పెంచే పోషకాల విషయంలో లోపాలను సవరించి తదుపరి ప్రణాళికలు చేసుకోవాలని వివరించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe