కర్నూలులో తలపెట్టిన సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్ సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. రూ.13,429 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… మోదీ లాంటి గొప్ప వ్యక్తి తన జీవితంలో చూడలేదన్నారు. రాబోయే శతాబ్ధాలకు ప్రధాని మోదీ పునాది వేశారని కొనియాడారు.

అన్ని వర్గాలకు లబ్ధి కలిగించేలా ప్రధాని మోదీ సంస్కరణలు తీసుకొచ్చారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. జీఎస్టీ తగ్గింపుతో ప్రతి కుటుంబానికి మేలు జరుగుతోందని చెప్పారు. సూపర్ జీఎస్టీతో సూపర్ సేవింగ్స్ ఉంటాయన్నారు. జీఎస్టీలో కొత్త సంస్కరణలు తీసుకొచ్చినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతున్నామని సీఎం చంద్రబాబు ప్రసంగించారు.
“సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్ ఇది ప్రారంభం మాత్రమే. సరైన సమయంలో.. సరైన నాయకుడు దేశాన్ని పాలిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్‌తో మన సైనిక బలమేంటో చూపించాం. జీఎస్టీ తగ్గింపుతో ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.10 వేలు ఆదా అవుతుంది” అని సీఎం చంద్రబాబు వివరించారు.
మోదీ కర్మయోగి - డిప్యూటీ సీఎం పవన్
రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… ప్రధాని మోడీ ఒక కర్మయోగి అన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా పనిచేస్తున్నారు కాబట్టే మోడీని కర్మయోగి అంటామని చెప్పారు. జీఎస్టీ సంస్కరణలు చేపట్టి సామాన్యులకు రిలీఫ్ కల్పించారని తెలిపారు. ఆత్మనిర్భర భారత్ దిశగా ముందుకెళ్తున్నామన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం 15 ఏళ్లు పాలిస్తుందని… ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకొని నిలబడతామని వ్యాఖ్యానించారు.
ఈ సభలో రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ మాట్లాడారు. నమో అంటే విక్టరీ అని వ్యాఖ్యానించారు. ఆయన ఏది చేపట్టినా విజయమే అని చెప్పారు. ప్రపంచ దేశాలు పన్నులు పెంచితే, మన ప్రధాని ట్యాక్స్‌లు తగ్గించారన్నారు. దసరా, దీపావళి కలిసి వస్తే వచ్చేది సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్ అని ప్రసంగించారు.
{{/usCountry}}ఈ సభలో రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ మాట్లాడారు. నమో అంటే విక్టరీ అని వ్యాఖ్యానించారు. ఆయన ఏది చేపట్టినా విజయమే అని చెప్పారు. ప్రపంచ దేశాలు పన్నులు పెంచితే, మన ప్రధాని ట్యాక్స్‌లు తగ్గించారన్నారు. దసరా, దీపావళి కలిసి వస్తే వచ్చేది సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్ అని ప్రసంగించారు.
{{/usCountry}}