మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ - కాకినాడ సెజ్ భూములు రైతులకే రిజిస్ట్రేషన్..! ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు
కాకినాడ సెజ్ రైతులకు ఊరట లభించింది. సెజ్‌కు రైతులు ఇచ్చిన భూములు వెనక్కి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైతులు ఇచ్చిన 2,180 ఎకరాలు తిరిగి వారికే దక్కనుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) పరిధిలోని భూములను తిరిగి రైతులకే దక్కనున్నాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ భూములను ఇప్పించే బాధ్యత తీసుకుంటానని గత ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ హామీ కూడా ఇచ్చారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కల్యాణ్…. ఈ భూముల విషయంపై సీఎం చంద్రబాబుతో ప్రత్యేకంగా చర్చించి…రైతులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నారు. దీంతో నాడు పవన్ కల్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లు అయింది.

తిరిగి రైతులకే రిజిస్ట్రేషన్….
సెజ్ పరిధిలోని 2,180 ఎకరాల భూములకు స్టాంప్, రిజిస్ట్రేషన్ డ్యూటీలను మినహాయించి తిరిగి రైతులకు రిజిస్ట్రేషన్ చేయనున్నారు. దీంతో కాకినాడ తీరంలోని తొండంగి, ఉప్పాడ కొత్తపల్లి మండలాల పరిధిలో సుమారు 1,551 మంది రైతులకు మేలు జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ ఆదేశాలు కూడా ఇచ్చింది.
ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో కాకినాడ సెజ్ లో అవార్డు భూములను తిరిగి రైతులకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాలిచ్చారు. ఈ రిజిస్ట్రేషన్ లకు రిజిస్ట్రేషన్ రుసుములు, స్టాంప్ డ్యూటీలు వసూలు చేయకూడదని ఆదేశాలలో పేర్కొన్నారు. ఉప్పాడ కొత్తపల్లి, తొండంగి మండలాల పరిధిలో ఈ భూములు ఉన్నాయి.
గతంలో కాకినాడ సెజ్ భూములపై జీవో నెం.12 విడుదల అయినా క్షేత్రస్థాయిలో మాత్రం రైతులకు మేలు జరగలేదు. వారి పేరున రిజిస్ట్రేషన్లు జరగలేదు. దీంతో పిల్లలకు పెళ్లిళ్లు, చదువుల నిమిత్తం భూములు ఉపయోగపడటం లేదని రైతులు పవన్ కళ్యాణ్ కు గతంలో నివేదించారు. దీనిపై పూర్తి వివరాలు పరిశీలించి, రైతులకు మేలు జరిగేలా చూస్తానని జనసేన అధినేతగా అప్పట్లో పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.
ఈ సమస్యను ఇటీవల శాసనమండలిలో సమావేశాల్లో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. రైతుల పడుతున్న ఇబ్బందులను సభలో ప్రస్తావించారు. భూములు రైతుల పేరిట రిజిస్ట్రేషన్ కాకపోవడంతో రైతు భరోసా వంటి పథకాల లబ్ధి అందడం లేదని, బ్యాంకుల నుంచి రుణాలు పొందడానికీ వీలు లేకుండా పోయిందన్నారు.
ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కాకినాడ సెజ్ రైతులకు స్టాంప్, రిజిస్ట్రేషన్ డ్యూటీలను మినహాయించి తిరిగి రైతుల భూములు రైతులకు తిరిగి రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించింది. రైతులకు ఊరట కలిగించేలా నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు రెవెన్యూశాఖ మంత్రి అనగానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

