రాబోయే శతాబ్ధాలకు ప్రధాని మోదీ పునాది వేశారు - సీఎం చంద్రబాబు

సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్‌ ఇది ప్రారంభం మాత్రమే అని సీఎం చంద్రబాబు అన్నారు. కర్నూలులో తలపెట్టిన సభకు ప్రధాని మోదీతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు… సరైన సమయంలో సరైన నాయకుడు దేశాన్ని పాలిస్తున్నారని మోదీపై ప్రశంసలు గుప్పించారు.

Published on: Oct 16, 2025, 15:46:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కర్నూలులో తలపెట్టిన సూపర్ జీఎస్టీ - సూపర్‌ సేవింగ్స్‌ సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. రూ.13,429 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… మోదీ లాంటి గొప్ప వ్యక్తి తన జీవితంలో చూడలేదన్నారు. రాబోయే శతాబ్ధాలకు ప్రధాని మోదీ పునాది వేశారని కొనియాడారు.

శ్రీశైలంలో ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్
శ్రీశైలంలో ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్

అన్ని వర్గాలకు లబ్ధి కలిగించేలా ప్రధాని మోదీ సంస్కరణలు తీసుకొచ్చారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. జీఎస్టీ తగ్గింపుతో ప్రతి కుటుంబానికి మేలు జరుగుతోందని చెప్పారు. సూపర్ జీఎస్టీతో సూపర్ సేవింగ్స్ ఉంటాయన్నారు. జీఎస్టీలో కొత్త సంస్కరణలు తీసుకొచ్చినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతున్నామని సీఎం చంద్రబాబు ప్రసంగించారు.

“సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్‌ ఇది ప్రారంభం మాత్రమే. సరైన సమయంలో.. సరైన నాయకుడు దేశాన్ని పాలిస్తున్నారు. ఆపరేషన్‌ సిందూర్‌తో మన సైనిక బలమేంటో చూపించాం. జీఎస్టీ తగ్గింపుతో ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.10 వేలు ఆదా అవుతుంది” అని సీఎం చంద్రబాబు వివరించారు.

మోదీ కర్మయోగి - డిప్యూటీ సీఎం పవన్

రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… ప్రధాని మోడీ ఒక కర్మయోగి అన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా పనిచేస్తున్నారు కాబట్టే మోడీని కర్మయోగి అంటామని చెప్పారు. జీఎస్టీ సంస్కరణలు చేపట్టి సామాన్యులకు రిలీఫ్‌ కల్పించారని తెలిపారు. ఆత్మనిర్భర భారత్ దిశగా ముందుకెళ్తున్నామన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం 15 ఏళ్లు పాలిస్తుందని… ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకొని నిలబడతామని వ్యాఖ్యానించారు.

ఈ సభలో రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ మాట్లాడారు. నమో అంటే విక్టరీ అని వ్యాఖ్యానించారు. ఆయన ఏది చేపట్టినా విజయమే అని చెప్పారు. ప్రపంచ దేశాలు పన్నులు పెంచితే, మన ప్రధాని ట్యాక్స్‌లు తగ్గించారన్నారు. దసరా, దీపావళి కలిసి వస్తే వచ్చేది సూపర్‌ జీఎస్టీ - సూపర్‌ సేవింగ్స్‌ అని ప్రసంగించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More