అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబుతీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ప్రైవేటు బస్సు ప్రమాదం తీవ్రంగా కలిచివేసిందని ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం విచారకరమన్నారు.

ప్రమాదంపై అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు… బాధితులకు అందుతున్న సాయంపై వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రమాద మృతుల కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని ప్రకటించారు.
“అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు వద్ద జరిగిన యాత్రికుల ప్రైవేటు బస్సు ప్రమాదం తీవ్రంగా కలిచివేసింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం విచారకరం. ప్రమాదంపై అధికారులతో మాట్లాడాను, బాధితులకు అందుతున్న సాయంపై వివరాలు తెలుసుకున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించాను. ప్రమాద మృతుల కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటాం” అని సీఎం చంద్రబాబు తెలిపారు.
గురువారం ఉదయం అల్లూరి సీతారామరాజు (ఏఎస్ఆర్) జిల్లాలోని చింతూరు-భద్రాచలం మధ్య ఘాట్ రోడ్డుపై బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందినట్లు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారని… వారిని చికిత్స నిమిత్తం భద్రాచలం ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు.
ఆదుకుంటాం - డిప్యూటీ సీఎం పవన్
“అల్లూరి సీతారామ రాజు జిల్లాలో బస్సు లోయలో పడిన దుర్ఘటనలో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారని తెలిసి చింతిస్తున్నాను. యాత్రికులతో కూడిన బస్సు చింతూరు - మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో అదుపు తప్పి లోయలో పడిపోయిందని అధికారుల ద్వారా అందిన సమాచారం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఈ దుర్ఘటనలో 22 మంది గాయపడ్డారు. క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించడమైనది. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తగిన విధంగా ఆదుకుంటుంది” అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు.
తీవ్రంగా కలిచివేసింది - మంత్రి లోకేశ్
చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డు రాజుగారిమెట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు."చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు వ్యక్తులు మృతి చెందడం తీవ్రంగా కలచివేసింది. ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలో పడటంతో దుర్మరణం పాలవడం బాధాకరం. ప్రమాద ఘటనపై హోంమంత్రి అనిత గారితో ఫోన్ లో ఆరా తీశాను. సహాయ కార్యక్రమాలు వేగంగా జరిగేలా చూడాలని చెప్పాను. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అని ఓ ప్రకటన ద్వారా పేర్కొన్నారు.
{{/usCountry}}చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డు రాజుగారిమెట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు."చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు వ్యక్తులు మృతి చెందడం తీవ్రంగా కలచివేసింది. ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలో పడటంతో దుర్మరణం పాలవడం బాధాకరం. ప్రమాద ఘటనపై హోంమంత్రి అనిత గారితో ఫోన్ లో ఆరా తీశాను. సహాయ కార్యక్రమాలు వేగంగా జరిగేలా చూడాలని చెప్పాను. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అని ఓ ప్రకటన ద్వారా పేర్కొన్నారు.
{{/usCountry}}