అల్లూరి జిల్లా బస్సు ప్రమాదం : సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి - బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటన

అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని ప్రకటన చేశారు.

Published on: Dec 12, 2025, 09:21:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబుతీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ప్రైవేటు బస్సు ప్రమాదం తీవ్రంగా కలిచివేసిందని ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం విచారకరమన్నారు.

బోల్తా పడిన ప్రైవేట్ బస్సు
బోల్తా పడిన ప్రైవేట్ బస్సు

ప్రమాదంపై అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు… బాధితులకు అందుతున్న సాయంపై వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రమాద మృతుల కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని ప్రకటించారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు వద్ద జరిగిన యాత్రికుల ప్రైవేటు బస్సు ప్రమాదం తీవ్రంగా కలిచివేసింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం విచారకరం. ప్రమాదంపై అధికారులతో మాట్లాడాను, బాధితులకు అందుతున్న సాయంపై వివరాలు తెలుసుకున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించాను. ప్రమాద మృతుల కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటాం” అని సీఎం చంద్రబాబు తెలిపారు.

గురువారం ఉదయం అల్లూరి సీతారామరాజు (ఏఎస్ఆర్) జిల్లాలోని చింతూరు-భద్రాచలం మధ్య ఘాట్ రోడ్డుపై బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందినట్లు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారని… వారిని చికిత్స నిమిత్తం భద్రాచలం ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు.

ఆదుకుంటాం - డిప్యూటీ సీఎం పవన్

“అల్లూరి సీతారామ రాజు జిల్లాలో బస్సు లోయలో పడిన దుర్ఘటనలో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారని తెలిసి చింతిస్తున్నాను. యాత్రికులతో కూడిన బస్సు చింతూరు - మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో అదుపు తప్పి లోయలో పడిపోయిందని అధికారుల ద్వారా అందిన సమాచారం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఈ దుర్ఘటనలో 22 మంది గాయపడ్డారు. క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించడమైనది. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తగిన విధంగా ఆదుకుంటుంది” అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు.

తీవ్రంగా కలిచివేసింది - మంత్రి లోకేశ్

చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డు రాజుగారిమెట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు."చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు వ్యక్తులు మృతి చెందడం తీవ్రంగా కలచివేసింది. ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలో పడటంతో దుర్మరణం పాలవడం బాధాకరం. ప్రమాద ఘటనపై హోంమంత్రి అనిత గారితో ఫోన్ లో ఆరా తీశాను. సహాయ కార్యక్రమాలు వేగంగా జరిగేలా చూడాలని చెప్పాను. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అని ఓ ప్రకటన ద్వారా పేర్కొన్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More