AP Entrance Exams 2026 : ఉమ్మడి ప్రవేశ పరీక్షల అప్డేట్ - మే 12 నుంచి AP EAPCET, మిగతా తేదీలివే
ఆంధ్రప్రదేశ్ లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు సంబంధించి తేదీలను ఏపీ ఉన్నత విద్యామండలి వెల్లడించింది.
ఏపీలో 2026-27 విద్యా సంవత్సరంలో నిర్వహించే పలు యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈఏపీసెట్, ఐసెట్, లాసెట్, పీజీసెట్, పీఈసెట్ పరీక్షలను నిర్వహించారు. అయితే తాజాగా ఈ పరీక్షల నిర్వహణ తేదీలను ఏపీ ఉన్నత విద్యామండలి వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

పరీక్ష తేదీలు:
- ఏపీ ఉన్నత విద్యా మండలి ప్రకటనలోని వివరాల ప్రకారం…. ఏపీ ఈఏపీసెట్ (ఇంజనీరింగ్) స్ట్రీమ్ మే 12 నుంచి 15వ తేదీలతో పాటు 18వ తేదీన పరీక్షలను నిర్వహిస్తారు.
- ఏపీ ఈఏపీసెట్ ఫార్మసీ స్ట్రీమ్ పరీక్షలను మే 19, 20 తేదీల్లో నిర్వహిస్తారు.
- ఏపీఈసెట్ పరీక్ష ఏప్రిల్ 23వ తేదీన ఉంటుంది.
- ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఐసెట్ - ఏప్రిల్ 28వ తేదీన నిర్వహిస్తారు.
- ఏపీ పీజీఈసెట్ పరీక్షను ఏప్రిల్ 29, 30, మే 2వ తేదీన నిర్వహిస్తారు.
- ఏపీ లాసెట్ పరీక్ష మే 4వ తేదీన ఉంటుంది.
- ఏపీ ఎడ్ సెట్ - మే 4వ తేదీని నిర్వహిస్తారు.
- ఏపీ పీజీసెట్ మే 5వ తేదీతో పాటు 8 నుంచి 11 తేదీల మధ్య నిర్వహిస్తారు.
- ఏపీపీఈసెట్ మే/జూన్ నెలలో నిర్వహిస్తారు.
ఇంజనీరింగ్, ఫార్మసీ స్ట్రీమ్ పరీక్షల కోసం భారీగానే విద్యార్థులు దరఖాస్తులు చేసుకుంటారు. ఇంజినీరింగ్ సీట్ల కోసం మంచి డిమాండ్ ఉంటుంది. అయితే ఎంట్రెన్స్ పరీక్షలో విద్యార్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది.
ఏపీ ఈఏపీ సెట్ అభ్యర్థులు ఇంటర్మీడియట్ విద్యా బోర్డు నుండి ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో 12వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. 12వ తరగతి పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులు కూడా ఏపీ ఈఏపీసెట్ 2026 ఇంజనీరింగ్ పరీక్షలను రాయవచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

