...
...
Next Story

AP Degree Admissions 2026 : ఏపీ డిగ్రీ అడ్మిషన్ల అప్డేట్ - ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభం, ప్రాసెస్ ఇలా

AP Degree Admissions 2026 : ఆంధ్రప్రదేశ్‌లో డిగ్రీ మొదటి సంవత్సరం కోర్సుల ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు నమోదు చేసుకున్న వెబ్ ఆప్షన్లు, మెరిట్ ఆధారంగా ఈ నెల 26న సీట్లను కేటాయిస్తారు.

Published on: Aug 7, 2026, 15:47:46 IST
Advertisement

AP Degree Admissions 2026 : రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరాలనుకునే అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకోవాలని ఉన్నత విద్యాశాఖ సూచించింది.

ఏపీ డిగ్రీ ప్రవేశాలు
ఏపీ డిగ్రీ ప్రవేశాలు

డిగ్రీ కోర్సుల్లో చేరానుకునే విద్యార్థులు ఈ నెల 11వ తేదీ వరకు అధికారిక పోర్టల్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు.హెల్ప్‌డెస్క్ సెంటర్లలో విద్యార్థుల ధ్రువపత్రాల (సర్టిఫికెట్లు) పరిశీలన ప్రక్రియ ఈ నెల 5వ తేదీన ప్రారంభమై 20వ తేదీ వరకు కొనసాగుతుంది.ప్రత్యేక కేటగిరీల పరిశీలన ఎన్సీసీ, స్పోర్ట్స్, దివ్యాంగులు తదితర ప్రత్యేక కేటగిరీ కింద దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సర్టిఫికెట్లను ఈ నెల 12, 13 తేదీల్లో పరిశీలిస్తారు.

ఈనెల 26న సీట్ల కేటాయింపు…

తమకు నచ్చిన కళాశాలలు, కోర్సులను ఎంచుకునేందుకు ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లకు సమయం ఇచ్చారు. నమోదు చేసుకున్న వెబ్ ఆప్షన్లలో ఏవైనా మార్పులు లేదా చేర్పులు చేసుకోవాలనుకుంటే ఈ నెల 20వ తేదీన ఎడిట్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. విద్యార్థులు నమోదు చేసుకున్న ఆప్షన్లు, మెరిట్ మార్కుల ఆధారంగా ఈ నెల 26న సీట్ల కేటాయింపు వివరాలను వెల్లడిస్తారు.

సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 27 నుంచి 29వ తేదీల మధ్య తమకు కేటాయించిన కళాశాలలకు నేరుగా వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ అవసరమైన సర్టిఫికెట్లను సమర్పించి సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాలి. మరోవైపు డిగ్రీ మొదటి సంవత్సరం రెగ్యులర్ తరగతులను ఈ నెల 27వ తేదీ నుంచే ప్రారంభిస్తున్నట్లు ఉన్నత విద్యాశాఖ స్పష్టం చేసింది. కాబట్టి విద్యార్థులు సమయం వృథా చేయకుండా నిర్ణీత గడువు లోపలే రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ల ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించింది.

రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం ఇలా…

  • ప్రవేశాల కోసం విద్యార్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://cap.apcfss.in/ ఓపెన్ చేయాలి.
  • హోం పేజీలో కనిపించే 'Register Now' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  • అక్కడ అడిగిన మీ ప్రాథమిక వివరాలైన పేరు, ఆధార్ సంఖ్య, మొబైల్ నంబర్‌లను సరిగ్గా ఎంటర్ చేయాలి.
  • ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్‌కు వచ్చే ఓటీపీ (OTP)ని ఎంటర్ చేసి లాగిన్ ప్రాసెస్ పూర్తవుతుంది.
  • లాగిన్ అయిన తర్వాత దరఖాస్తు రుసుము చెల్లించి, అవసరమైన సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe