...
...
Next Story

AP Degree Admissions 2026 : డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్ అప్డేట్ - రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు, చివరి తేదీ ఇదే

AP Degree Admissions 2026 Counselling : ఆంధ్రప్రదేశ్‌లో డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ గడువును ఉన్నత విద్యామండలి పొడిగించింది. అర్హులైన విద్యార్థులు ఆగస్టు 18 వరకు అప్లై చేసుకోవచ్చు.

Published on: Aug 12, 2026, 09:28:01 IST
Advertisement

AP Degree Admissions 2026 Counselling : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు పొందాలనుకుంటున్న విద్యార్థులకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఒక కీలక అప్‌డేట్ ఇచ్చింది. 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ల గడువును అధికారులు పొడిగించారు.

ఏపీ డిగ్రీ ప్రవేశాలు
ఏపీ డిగ్రీ ప్రవేశాలు

ఇంకా దరఖాస్తు చేసుకోని అర్హులైన అభ్యర్థులు ఈ నెల 18వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. విద్యార్థులు ఆఖరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే తమ దరఖాస్తులను పూర్తి చేయాలని సూచించారు.

ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం….. స్పెషల్ కేటగిరి (ఎన్‌సీసీ, క్యాప్, స్పోర్ట్స్, దివ్యాంగులు) కింద దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదని ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది. నిర్ణయించిన ప్రకారమే ఇవాళ, రేపు వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుంది.

డిగ్రీ అడ్మిషన్ల షెడ్యూల్ - ముఖ్య తేదీలు

  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ : ఈ నెల 18
  • వెబ్ ఆప్షన్ల నమోదు : ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు విద్యార్థులు తమకు నచ్చిన కళాశాలలు, కోర్సులను ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది.
  • వెబ్ ఆప్షన్ల ఎడిట్ : నమోదు చేసుకున్న వెబ్ ఆప్షన్లలో ఏవైనా మార్పులు లేదా చేర్పులు చేసుకోవాలనుకుంటే ఈ నెల 20వ తేదీన ఎడిట్ చేసుకోవచ్చు.
  • సీట్ల కేటాయింపు : విద్యార్థులు ఎంచుకున్న ఆప్షన్లు, ఇంటర్మీడియట్ మార్కుల మెరిట్ మరియు రిజర్వేషన్ నిబంధనల ఆధారంగా ఈ నెల 26న సీట్లను కేటాయిస్తారు.
  • కాలేజీల్లో రిపోర్టింగ్ : సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 27 నుంచి 29వ తేదీల మధ్య తమకు కేటాయించిన కళాశాలలకు నేరుగా వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్లను సమర్పించి సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాలి.
  • తరగతుల ప్రారంభం : డిగ్రీ మొదటి సంవత్సరం రెగ్యులర్ తరగతులను ఈ నెల 27వ తేదీ నుంచే ప్రారంభిస్తున్నట్లు ఉన్నత విద్యాశాఖ వెల్లడించింది.

ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం…

  1. విద్యార్థులు మొదట అధికారిక వెబ్‌సైట్ https://cap.apcfss.in/ ను సందర్శించాలి.
  2. హోమ్ పేజీలో కనిపించే 'Register Now' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  3. మీ పేరు, ఆధార్ సంఖ్య, మొబైల్ నంబర్ వంటి ప్రాథమిక వివరాలను సరిగ్గా ఎంటర్ చేయాలి.
  4. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ (OTP)ని నమోదు చేసి లాగిన్ అవ్వాలి.
  5. లాగిన్ పూర్తయిన తర్వాత ఆన్‌లైన్ దరఖాస్తు రుసుము (Application Fee) చెల్లించి, అడిగిన అన్ని ధ్రువపత్రాలను స్పష్టంగా అప్‌లోడ్ చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks