...
...
Next Story

AP Degree Admission 2026 : ఏపీ డిగ్రీ అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల - ఈనెల 5 నుంచి రిజిస్ట్రేషన్లు, ముఖ్య తేదీలు

AP Degree Admissions 2026 : ఆంధ్రప్రదేశ్‌లో డిగ్రీ ప్రవేశాల కోసం ఉన్నత విద్యాశాఖ ఆన్‌లైన్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఆగస్టు 5 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి.

Published on: Aug 4, 2026, 08:37:23 IST
Advertisement

AP Degree Admissions 2026 : రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో చేరాలనుకుంటున్న విద్యార్థులకు బిగ్ అలర్ట్. 2026-27 విద్యాసంవత్సరానికి గాను డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన ఆన్‌లైన్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ అధికారికంగా విడుదల చేసింది. దీనికి సంబంధించిన సమగ్ర నోటిఫికేషన్‌ను మంగళవారం(ఇవాళ) విడుదల చేయనున్నారు.

ఏపీ డిగ్రీ అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
ఏపీ డిగ్రీ అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

డిగ్రీ కోర్సుల్లో చేరడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలోనే రిజిస్ట్రేషన్ల నుంచి సీట్ల కేటాయింపు వరకు అన్ని ప్రక్రియలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఉన్నత విద్యాశాఖ ప్రకటించిన టైమ్‌లైన్ ప్రకారం విద్యార్థులు తమ వద్ద ఉన్న సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

డిగ్రీ అడ్మిషన్ల సమగ్ర షెడ్యూల్ - ముఖ్య తేదీలు :

  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు : ఈనెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు విద్యార్థులు అధికారిక పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • సర్టిఫికెట్ల పరిశీలన (HLC) : హెల్ప్‌డెస్క్ సెంటర్లలో విద్యార్థుల ధ్రువపత్రాల (సర్టిఫికెట్లు) పరిశీలన ప్రక్రియ ఈ నెల 5వ తేదీన ప్రారంభమై 20వ తేదీ వరకు కొనసాగుతుంది.
  • ప్రత్యేక కేటగిరీల పరిశీలన ఎన్సీసీ, స్పోర్ట్స్, దివ్యాంగులు తదితర ప్రత్యేక కేటగిరీ కింద దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సర్టిఫికెట్లను ఈ నెల 12 మరియు 13 తేదీల్లో పరిశీలిస్తారు.
  • వెబ్ ఆప్షన్ల నమోదు : తమకు నచ్చిన కళాశాలలు, కోర్సులను ఎంచుకోవడానికి వెబ్ ఆప్షన్లు ఇచ్చేందుకు ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు సమయం ఇచ్చారు.
  • వెబ్ ఆప్షన్ల సవరణ : ఎంచుకున్న ఆప్షన్లలో ఏవైనా మార్పులు లేదా చేర్పులు చేసుకోవాలనుకుంటే ఈ నెల 20వ తేదీన అవకాశం కల్పిస్తారు.
  • సీట్ల కేటాయింపు : అభ్యర్థులు నమోదు చేసుకున్న వెబ్ ఆప్షన్లు, మెరిట్ ఆధారంగా ఈ నెల 26న సీట్ల కేటాయింపు వివరాలను వెల్లడిస్తారు.
  • కళాశాలల్లో రిపోర్టింగ్ : సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 27 నుంచి 29వ తేదీల మధ్య తమకు కేటాయించిన కళాశాలల్లో నేరుగా హాజరై రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ - https://oamdc.ucanapply.com

ఈ నెల 27 నుంచే డిగ్రీ తరగతులు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe