...
...
Next Story

AP Degree Counselling : డిగ్రీ రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి - అలాట్‌మెంట్ లింక్ , రిపోర్టింగ్ తేదీలివే

AP Degree Counselling 2026 : ఆంధ్రప్రదేశ్‌లో డిగ్రీ ప్రవేశాల రెండో విడత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు పూర్తయింది. సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబర్ 30 వరకు సర్టిఫికెట్లతో కళాశాలల్లో రిపోర్ట్ చేయాలి.

Published on: Sep 28, 2026, 17:03:22 IST
Advertisement

AP Degree Counselling 2026 : రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఉన్నత విద్యామండలి కీలక అప్డేట్ అందించింది. డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన రెండో విడత (సెకండ్ ఫేజ్) కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. ఈ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు తమకు కేటాయించిన కళాశాలల్లో నేరుగా హాజరై ప్రవేశ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

రిపోర్టింగ్ గడువు….

ఏపీలో డిగ్రీ ప్రవేశాలు
ఏపీలో డిగ్రీ ప్రవేశాలు

రెండో విడతలో సీటు దక్కించుకున్న అభ్యర్థులు సెప్టెంబర్ 28, 2026 నుంచి సెప్టెంబర్ 30, 2026 మధ్య సంబంధిత కళాశాలలకు వెళ్లాలి. నిర్ణీత గడువులోగా కళాశాలలో నేరుగా హాజరై, తమ సర్టిఫికెట్లను సమర్పించి రిపోర్ట్ చేయాలని ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది.

సీటు వచ్చినప్పటికీ నిర్దేశించిన సమయంలోగా కళాశాలలో రిపోర్టింగ్ పూర్తి చేయని విద్యార్థుల సీట్లను రద్దు చేసే అవకాశముంది. కాబట్టి అభ్యర్థులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను ముగించాలని అధికారులు సూచిస్తున్నారు.

అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ ఇలా…

విద్యార్థులు తమ అలాట్‌మెంట్ వివరాలను సులభంగా తెలుసుకునేందుకు ఉన్నత విద్యామండలి పోర్టల్‌ను అందుబాటులో ఉంచింది. ప్రాసెస్ వివరాలు ఇలా….

  1. ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://cap.apcfss.in/ ను సందర్శించాలి.
  2. హోమ్‌పేజీలో ఉన్న లాగిన్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  3. మీ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ వివరాలను నమోదు చేసి లాగిన్ అవ్వాలి.
  4. లాగిన్ అయిన తర్వాత మీకు సీటు కేటాయింపు జరిగితే, స్క్రీన్‌పై అలాట్‌మెంట్ ఆర్డర్ కాపీ కనిపిస్తుంది.
  5. ఆ అలాట్‌మెంట్ ఆర్డర్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ తీసి భద్రపరుచుకోవాలి.

తీసుకెళ్లాల్సిన ముఖ్యమైన ధ్రువపత్రాలు

  • డౌన్‌లోడ్ చేసుకున్న అలాట్‌మెంట్ ఆర్డర్ కాపీ
  • అన్ని ఒరిజినల్ విద్యార్హత సర్టిఫికెట్లు
  • ఆధార్ కార్డ్
  • ఇతర అవసరమైన కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాలు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks