వేదికపై రోడ్డు కోసం విన్నపం - సభ ముగిసేలోగా మంజూరు…! నిమిషాల్లోనే నిర్ణయం తీసుకున్న డిప్యూటీ సీఎం

సభా వేదికపై వినిపించిన ఓ గిరిజన యువకుడి విన్నపం నిమిషాల్లోనే కార్యరూపం దాల్చింది. కానిస్టేబుల్ నియామక సభలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాలతో గంటల వ్యవధిలోనే ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెనుములబండ గ్రామానికి రూ.2 కోట్ల బీటీ రోడ్డు మంజూరు అయ్యింది. 

Published on: Dec 17, 2025, 07:19:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కానిస్టేబుల్ నియామక పత్రాల ప్రదానం కార్యక్రమం వేదికపై ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. రోడ్డు కోసం చేసిన విజ్ఞప్తిని విన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్… నిమిషాల వ్యవధిలోనే నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే రహదారి మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చారు. డిప్యూటీ సీఎం నిర్ణయంపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

వేదికపై రోడ్డు కోసం విన్నపం… సభ ముగిసేలోగా మంజూరు
వేదికపై రోడ్డు కోసం విన్నపం… సభ ముగిసేలోగా మంజూరు

అసలేం జరిగిందంటే…?

మంగళవారం కానిస్టేబుళ్లుగా నియామాకం అయిన వారికి పత్రాలు అందజేశారు. ఈ సభకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ హాజరయ్యారు. సభా వేదికపై కానిస్టేబుల్ గా నియమితుడైన గిరిజన యువకుడు లాకే బాబూరావు మాట్లాడుతూ… తన సక్సెస్ స్టోరీ వివరించారు. ఈ క్రమంలో తన గ్రామానికి రోడ్డు వేయించమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోరారు.

బాబూరావు కోరిక మేరకు అతని గ్రామానికి రోడ్డు వేసే బాధ్యతను వేదికపై ఉన్న ఉప ముఖ్యమంత్రి కు అప్పగించారు. దీంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని జీకే వీధి మండలం, దేవరపల్లి పంచాయతీ పరిధిలోని తెనుములబండ గ్రామానికి బీటీ రోడ్డును మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

తక్షణమే రోడ్డు నిర్మాణానికి అవసరమైన అంచనాలు రూపొందించి అనుమతులు ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పవన్ ఆదేశాలతో ఆఘమేఘాలపై కదిలిన యంత్రాంగం తెనుములబండ నుంచి ఎలుగురాతిబండ వరకు 2 కిలోమీటర్ల మేర రూ. 2 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేశారు. ఉప ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్ పరిపాలన అనుమతులు ఇచ్చారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More