డిజిటల్ హెల్త్ రికార్డులను సంజీవని ప్రాజెక్టు ద్వారా రూపొందిస్తున్నాం : సీఎం చంద్రబాబు

పౌరుల డిజిటల్ హెల్త్ రికార్డులను సంజీవని ప్రాజెక్టు ద్వారా రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రోగాన్ని ముందుగా నియంత్రించే ప్రివెంటీస్ టెక్నాలజీపై దృష్టిపెట్టాలని అధికారులకు సూచించారు.

Published on: Dec 16, 2025 3:34 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వైద్యారోగ్య శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి ప్రభుత్వం అమలు చేస్తోన్న సంజీవని సహా వివిధ ప్రాజెక్టులపై చర్చించారు. మెరుగైన ప్రజారోగ్య నిర్వహణకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వైద్యారోగ్య రంగంలోని నిపుణులతో సంప్రదింపులు జరిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షకు UN AIDS ప్రతినిధి పీటర్ పాయిట్, WHO సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్, ఎఐజీ చైర్మన్ డి.నాగేశ్వర్ రెడ్డి, సింగపూర్ ప్రతినిధి ప్రొఫెసర్ ఇక్ ఇంగ్ టియో, ఆర్తి అహుజా, రిజ్వాన్ కొయిటా‌తోపాటుగా ఇతర వైద్య నిపుణులతో కూడిన అత్యున్నత స్థాయి సలహా బృందం సభ్యులు హాజరయ్యారు. మంత్రి సత్యకుమార్ యాదవ్, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు, గేట్స్ ఫౌండేషన్ కంట్రీ డైరెక్టర్ అర్చనా వ్యాస్ తదితరులు కూడా సమావేశంలో పాల్గొన్నారు.

సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు

వైద్యారోగ్య రంగంలో ప్రమాణాలను అందుకునేలా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన సూచనలను అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. పౌరులకు సంబంధించిన డిజిటల్ హెల్త్ రికార్డులను సంజీవని ప్రాజెక్టు ద్వారా రూపొందిస్తున్నట్టుగా వెల్లడించారు.

'గేట్స్ ఫౌండేషన్ సహకారంతో కుప్పం, చిత్తూరు జిల్లాల్లో డిజిటల్ నెర్వ్ సెంటర్ ద్వారా ఈ వివరాలు సేకరించి ఇంటిగ్రేట్ చేశాం. రియల్ టైమ్‌లోనే వారి వివరాలను తెలుసుకునేలా సంజీవని ద్వారా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. పలు అంశాల్లో పౌరులకు సంబంధించిన ఆరోగ్య సమాచారం అందుబాటులో ఉంటుంది.' అని చంద్రబాబు తెలిపారు.

రోగం వచ్చినాక తీసుకునే జాగ్రత్తల కంటే ఆ జబ్బు రాకుండా ముందుగా నియంత్రించే ప్రివెంటీస్ టెక్నాలజీ మీద దృష్టి పెట్టాలని అధికారులకు చంద్రబాబు సూచనలు చేశారు. దీనిద్వారా వైద్యారోగ్యంపై ఖర్చులను తక్కువగా చేసే అవకాశం ఉందన్నారు. ఆరోగ్య రంగంలో వినూత్నంగా ప్రాజెక్టులు చేపట్టడానికి అత్యున్నత స్థాయి ఎక్స్‌పర్ట్ గ్రూప్ సలహాలు ఇవ్వాలన్నారు. క్వాంటం, ఏఐతో రియల్ టైమ్ డేటా విశ్లేషణలాంటి వాటితో ప్రజలకు సేవలు అందాలని చంద్రబాబు అన్నారు. గ్లోబల్ కమ్యూనిటీకి సేవలు అందించేలా ప్రస్తుతం సామర్థ్యాలను పెంచుకోవాలన్నారు.

'2047 స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాలకు అనుగుణంగా అంతిమంగా ప్రజలు జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. యోగాతోపాటుగా నేచురోపతిని ప్రోత్సహించాలి. ప్రివెంటీస్ వెల్‌నెస్, డిజిటల్ ఏఐ ఎనేబుల్డ్ హెల్త్, హెల్త్ ఫైనాన్సింగ్ రిఫార్మ్స్ వంటి అంశాలపై ఫోకస్ చేయాలి. వైద్య ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు పెద్ద ఎత్తున పెరగాలి.' అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More