...
...
Next Story

AP DSC 2026 Syllabus Download : ఏపీ కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ అప్డేట్ - సిలబస్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి

ఏపీలో కొత్త నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆన్ లైన్ దరఖాస్తు తేదీలు కూడా ఖరారయ్యాయి. అయితే ఈ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం సిలబస్ వివరాలు కూడా అందుబాటులోకి వచ్చాయి.

Published on: Oct 16, 2026, 16:47:10 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ కీలక సమాచారం అందించింది. రాష్ట్రంలో త్వరలో భర్తీ చేయనున్న ‘డీఎస్సీ - 2026’కు సంబంధించిన సిలబస్‌ను (Suggestive Syllabus) అందుబాటులోకి తీసుకువచ్చింది. రాబోయే డీఎస్సీ నోటిఫికేషన్‌లో ప్రకటించే ఖాళీలు, పోస్టులకు ఈ సిలబస్ ప్రామాణికంగా ఉంటుందని స్పష్టం చేసింది.

ఏపీ డీఎస్సీ 2026
ఏపీ డీఎస్సీ 2026

ప్రభుత్వ పాఠశాలల్లో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 2024-25 విద్యాసంవత్సరంలో అమలులో ఉన్న అకాడమిక్ సిలబస్‌ను ప్రామాణికంగా తీసుకుని డీఎస్సీ పరీక్షల ప్రశ్నపత్రాలను రూపొందిస్తామని విద్యాశాఖ బులెటిన్‌లో పేర్కొంది. ఈ మేరకు సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT), స్కూల్ అసిస్టెంట్ (SA), టీజీటీ (TGT), పీజీటీ (PGT), ప్రిన్సిపాల్స్, పీఈటీ పోస్టులకు వేర్వేరుగా సమగ్ర సిలబస్ వివరాలను పొందుపరిచింది.

ఏపీ డీఎస్సీ సిలబస్ - డౌన్లోడ్ ఇలా:

  1. ముందుగా https://tet2dsc.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలోని కనిపించే DSC-2026 Suggestive Syllabus లింక్ పై క్లిక్ చేయాలి.
  3. ఇక్కడ మీకు పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది. అన్ని పోస్టులకు సంబంధించిన సిలబస్ వివరాలంటాయి.
  4. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా ఈ కాపీని పొందొచ్చు.

ఇక ఈ డీఎస్సీ ప్రకటన ద్వారా ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, పురపాలక పాఠశాలల్లో 2,111 జనరల్ టీచర్ పోస్టులను (స్కూల్ అసిస్టెంట్లు 906, సెకండరీ గ్రేడ్ టీచర్లు 1,205) భర్తీ చేయనున్నారు. వీటితో పాటు 350 ప్రత్యేక ఉపాధ్యాయ (స్పెషల్ ఎడ్యుకేషన్) పోస్టులను, వివిధ సొసైటీల్లో ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, పీడీ, పీఈటీ కేటగిరీల్లో 260 పోస్టులను నింపనున్నారు.

ఈ నియామకాలకు సంబంధించి నవంబరు 3 నుంచి అధికారిక పోర్టల్ ( https://tet2dsc.apcfss.in ) ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరిస్తారు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యే ముందే విద్యాశాఖ పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను అందుబాటులోకి తీసుకువస్తుంది. పూర్తి నోటిఫికేషన్‌లో పోస్టుల వారీగా రోస్టర్లు, రిజర్వేషన్లు, వయోపరిమితి, విద్యార్హతలు మరియు పరీక్షా తేదీల సమాచారాన్ని సమగ్రంగా వెల్లడిస్తారు. ఈ దరఖాస్తులను ఆన్‌లైన్ మోడ్‌లో మాత్రమే సమర్పించాల్సి ఉంటుందని విద్యాశాఖ స్పష్టం చేసింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks