ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. 2,721 పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ (DSC) నోటిఫికేషన్ను ప్రభుత్వం బుధవారం రాత్రి విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసిట్టుగా సమాచారం. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ, పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా చూసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

గతంలోనే షార్ట్ నోటిఫికేషన్ జారీ చేసిన విద్యాశాఖ, బుధావరం రాత్రికల్లా పూర్తి వివరాలతో కూడిన సమగ్ర నోటిఫికేషన్ను అందుబాటులోకి తెస్తోంది. ఈ నోటిఫికేషన్లో ప్రధానంగా అభ్యర్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న పలు అంశాలపై స్పష్టత ఇవ్వనున్నారు.
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యే తేదీ, ముగింపు తేదీల పూర్తి సమాచారం ఇందులో ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షల (CBT) నిర్వహణ తేదీలు, హాల్ టికెట్ల డౌన్లోడ్ గడువు, సబ్జెక్టుల వారీగా పాఠ్యాంశాల వివరాలు, మార్కుల కేటాయింపు, వెయిటేజీ సమాచారం. వివరాలు నోటిఫికేషన్లో ఉంటాయి.
ఈ డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2,721 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో జనరల్ పాఠశాలలతో పాటు స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలోని ఖాళీలను చేర్చారు. సెకండరీ గ్రేడ్ టీచర్స్ 1,231, స్కూల్ అసిస్టెంట్లు 931, ఎస్జీటీ - స్పెషల్ ఎడ్యుకేషన్ 304, స్కూల్ అసిస్టెంట్లు - స్పెషల్ ఎడ్యుకేషన్ 255తో మొత్తం ఖాళీలు 2,721కు నోటిఫికేషన్ వస్తుంది.
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. మొదటి దశలోనే రికార్డు స్థాయిలో 16,342 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి విజయవంతంగా భర్తీ ప్రక్రియను పూర్తి చేసింది. ఈ రిక్రూట్మెంట్పై గతంలో పాఠశాల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ వేదికగానూ, మీడియా సమావేశాల్లోనూ స్పందిస్తూ అనేక కీలక వ్యాఖ్యలు చేశారు.
'గత ప్రభుత్వ హయాంలో పాఠశాల విద్య తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం 148 రోజుల్లోనే 16,342 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను ఎంతో పారదర్శకంగా పూర్తి చేశాం. వందలాది కోర్టు కేసులు ఎన్నో ఎదురైనప్పటికీ, న్యాయపరమైన చిక్కులన్నింటినీ అధిగమించి నిరుద్యోగుల కలలను సాకారం చేశాం. అపాయింట్మెంట్ ఆర్డర్లు అందించాం. పాఠశాలల్లో విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తిని పెంచి నాణ్యమైన విద్యను అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం.' అని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.
{{/usCountry}}'గత ప్రభుత్వ హయాంలో పాఠశాల విద్య తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం 148 రోజుల్లోనే 16,342 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను ఎంతో పారదర్శకంగా పూర్తి చేశాం. వందలాది కోర్టు కేసులు ఎన్నో ఎదురైనప్పటికీ, న్యాయపరమైన చిక్కులన్నింటినీ అధిగమించి నిరుద్యోగుల కలలను సాకారం చేశాం. అపాయింట్మెంట్ ఆర్డర్లు అందించాం. పాఠశాలల్లో విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తిని పెంచి నాణ్యమైన విద్యను అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం.' అని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.
{{/usCountry}}