AP DSC Online Application : నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు అప్డేట్ వచ్చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, వివిధ సంక్షేమ సొసైటీలలో ఖాళీగా ఉన్న మొత్తం 2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించే 'ఏపీ డీఎస్సీ-2026' ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు నవంబర్ 30వ తేదీ వరకు అప్లికేషన్ సమర్పించవచ్చు.
- రెగ్యులర్ పోస్టులు: జనరల్ పాఠశాలల్లో 2,111 స్కూల్ అసిస్టెంట్ (SA), సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు ఉన్నాయి.
- స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు : ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం ఉద్దేశించిన 350 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 150 స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్, 200 స్పెషల్ ఎడ్యుకేషన్ సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు ఉన్నాయి.
- సొసైటీ పాఠశాలల పోస్టులు: వివిధ ప్రభుత్వ సంక్షేమ సొసైటీల పరిధిలోని పాఠశాలల్లో ప్రిన్సిపాల్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ , ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (TGT), ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు కలిపి మొత్తం 260 పోస్టులను కేటాయించారు.
ముఖ్యమైన తేదీలు :

పాఠశాల విద్యా శాఖ ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి సమగ్ర సమయపట్టికను విద్యాశాఖ విడుదల చేసింది. నవంబర్ 30 వరకు దరఖాస్తులకు అవకాశం ఉండగా… డిసెంబర్ 14 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 11.11.2026 నుండి 30.11.2026 వరకు
- ఆన్‌లైన్ మాక్ టెస్ట్ : 05.12.2026
- హాల్ టికెట్ డౌన్లోడ్ : 14.12.2026 నుంచి హాల్ టికెట్ అందుబాటులోకి వస్తాయి.
- కంప్యూటర్ ఆధారిత పరీక్షలు : 20.12.2026 నుంచి 13.01.2027 వరకు
చివరి పరీక్ష పూర్తయిన మరుసటి రోజే ప్రాథమిక కీ (Initial Key)ని విడుదల చేస్తారు. ప్రాథమిక కీపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే, విడుదలైన 7 రోజులలోపు అభ్యర్థులు తమ ఆక్షేపణలను ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది. అభ్యంతరాల పరిశీలన ముగిసిన 7 రోజులకు తుది కీ ని వెల్లడిస్తారు. తుది కీ విడుదల చేసిన మరో 7 రోజుల్లో అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా తుది మెరిట్ జాబితాను ప్రకటిస్తారు.
నియామక పరీక్షల ప్రాసెసింగ్, నిర్వహణ నిమిత్తం అభ్యర్థులు ప్రతి పోస్టుకు రూ. 1000 చొప్పున దరఖాస్తు రుసుము చెల్లించాలి. ఈ రుసుమును నవంబర్ 11 నుంచి అధికారిక వెబ్‌సైట్‌లోని పేమెంట్ గేట్‌వే ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లించేందుకు వెసులుబాటు కల్పించారు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విధానం…
అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ https://tet2dsc.apcfss.in/ ద్వారా మాత్రమే తమ దరఖాస్తులను సమర్పించాలి. దరఖాస్తు ప్రక్రియను విద్యాశాఖ వెబ్ సైట్ నుంచి సులభంగా పూర్తి చేసుకోవచ్చు.
- ముందుగా https://tet2dsc.apcfss.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- హోమ్‌పేజీలో కనిపించే 'Candidate Login' ఆప్షన్‌పై క్లిక్ చేసి, అందులో 'New Registration' ను ఎంచుకోవాలి.
- అభ్యర్థి తన ఆధార్ సంఖ్య, స్క్రీన్‌పై కనిపించే క్యాప్చా (Captcha) కోడ్‌ను నమోదు చేసి 'సబ్మిట్' చేయాలి.
- అనంతరం అభ్యర్థికి సంబంధించిన వ్యక్తిగత వివరాలతో నూతన లాగిన్ ఐడీ, ప్రొఫైల్ రూపుదిద్దుకుంటుంది.
- లాగిన్ అయిన తర్వాత కావలసిన ఉపాధ్యాయ పోస్టును ఎంచుకుని, విద్యార్హతల వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయాలి.
- నిర్దేశిత రుసుమును ఆన్‌లైన్ విధానంలో చెల్లించి, చివరిగా దరఖాస్తును 'Submit' చేస్తే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. భవిష్యత్తు అవసరాల కోసం దరఖాస్తు కాపీని ప్రింట్ తీసుకుని భద్రపరుచుకోవాలి.