AP EAPCET 2026 : ఏపీ ఈఏపీసెట్‌కు తగ్గిన దరఖాస్తులు - ఈసారి ఎన్ని వచ్చాయంటే..?

AP EAPCET 2026 Applications : ఏపీ ఈఏపీసెట్‌కు ఈ ఏడాది స్వల్పంగా దరఖాస్తులు తగ్గాయి. గతేడాదితో పోల్చితే 7 వేలకుపైగా తక్కువ దరఖాస్తులు వచ్చాయి. 

Published on: Apr 29, 2026, 10:49:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

AP EAPCET 2026 Applications : ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్ - 2026 దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. అయితే ఈసారి స్వల్పంగా దరఖాస్తుల సంఖ్య తగ్గింది.

ఏపీ ఈఏపీసెట్‌ 2026 (istock image)
ఏపీ ఈఏపీసెట్‌ 2026 (istock image)

గత కొన్నేళ్లుగా లక్షలాది మంది విద్యార్థులు పోటీ పడే ఈ ప్రవేశ పరీక్షకు ఈసారి దరఖాస్తులు తగ్గాయి. గతేడాది దరఖాస్తుల సంఖ్యతో పోల్చితే…. ఈ సంఖ్య 7 వేల కంటే తక్కువగా ఉంది.

గతేడాది గణంకాలు పరిశీలిస్తే…. ఏపీ ఈఏపీసెట్ కు 3,62,448 దరఖాస్తులు వచ్చాయి. ఈసారి మాత్రం 3,55,004 అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి. అంటే గతడాదితో పోల్చితే ఈసారి దరఖాస్తుల సంఖ్య తక్కువగా ఉంది.

మరోవైపు… రాష్ట్రంలోని విద్యార్థులు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలైన జేఈఈ (JEE) కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటం…. అదేవిధంగా పక్క రాష్ట్రాల్లోని ప్రైవేటు యూనివర్సిటీల్లో ముందే అడ్మిషన్లు తీసుకోవడం కూడా ఈఏపీసెట్‌ దరఖాస్తులు తగ్గడానికి ఒక కారణంగా కనిపిస్తోంది. ఇక ఈఏపీసెట్‌కు దరఖాస్తులు తగ్గగా.. టీచింగ్ కోర్సుల కోసం నిర్వహించే ఎడ్‌సెట్ , న్యాయ విద్య కోసం నిర్వహించే లాసెట్ కు మాత్రం దరఖాస్తులు పెరిగాయి.

AP EAPCET 2026 హాల్ టికెట్లు విడుదల :

ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (AP EAPCET 2026) రాసే అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చింది. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లు మంగళవారం విడుదలయ్యాయి. అధికారిక వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటన ద్వారా సూచించారు.

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.in సందర్శించాలి.
  • హోం పేజీలో 'AP EAPCET - 2026' ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
  • అక్కడ కనిపించే 'Download Hall Ticket' లింక్‌ను ఎంచుకోవాలి.
  • మీ రిజిస్ట్రేషన్ నంబర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ (ఇంటర్) హాల్ టిక్కెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
  • వివరాలు సమర్పించగానే మీ హాల్ టిక్కెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

ఈసారి ఏపీ ఈఏపీసెట్ పరీక్షలను రెండు విభాగాలుగా నిర్వహించనున్నారు. ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు మే 12, 13, 14, 15, 18 తేదీల్లో జరుగుతాయి. అగ్రికల్చర్ - ఫార్మసీ స్ట్రీమ్ పరీక్షలు మే 19, 20 తేదీల్లో నిర్వహిస్తారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More