...
...
Next Story

AP EAPCET 2026 Counseling : ఏపీఈఏపీసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ అప్డేట్ - సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు పొడిగింపు

AP EAPCET Final Phase Self Reporting : ఏపీ ఈఏపీసెట్ ఇంజినీరింగ్ తుది విడత కౌన్సెలింగ్ సెల్ఫ్ రిపోర్టింగ్ గడువును పొడిగించారు. సీటు పొందిన విద్యార్థులు సెప్టెంబర్ 2 వరకు కళాశాలల్లో రిపోర్ట్ చేయవచ్చు.

Published on: Aug 31, 2026, 11:10:36 IST
Advertisement

AP EAPCET Final Phase Self Reporting : ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET) 2026 ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ తుది విడత (ఫైనల్ ఫేజ్) సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయిన సంగతి తెలిసిందే. అయితే విద్యార్థులకు అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. ఫైనల్ ఫేజ్‌లో సీట్లు పొందిన అభ్యర్థులు కళాశాలల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి కేటాయించిన చివరి తేదీని పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.

సెప్టెంబర్ 2 వరకు గడువు పొడిగింపు…

ఏపీ ఈఏపీసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్
ఏపీ ఈఏపీసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్

తాజా ప్రకటన ప్రకారం…. ఇంజినీరింగ్ సీటు సాధించిన అభ్యర్థులు సెప్టెంబర్ 2వ తేదీ వరకు సంబంధిత కళాశాలల్లో నేరుగా హాజరై తమ రిపోర్టింగ్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. నిర్ణీత గడువు లోగా రిపోర్ట్ చేయని అభ్యర్థుల సీటు రద్దయ్యే అవకాశం ఉంటుంది. అభ్యర్థులు ఈ అవకాశాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవాలని అధికారులు స్పష్టంగా హెచ్చరించారు. మరోవైపు…. ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం తరగతులను ఆగస్టు 27, 2026 నుంచే ప్రారంభమయ్యాయి.

అలాట్‌మెంట్ లెటర్ డౌన్లోడ్ ఇలా…

  1. ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://cap.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోమ్‌పేజీలో స్పష్టంగా కనిపించే 'క్యాండిడేట్ లాగిన్' (Candidate Login) లింక్‌పై క్లిక్ చేయాలి.
  3. అభ్యర్థికి కేటాయించిన హాల్ టికెట్ నంబర్, పాస్‌వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలను సరిగ్గా నమోదు చేసి సిస్టమ్‌లోకి లాగిన్ అవ్వాలి.
  4. లాగిన్ అయిన వెంటనే స్క్రీన్‌పై కేటాయించిన కాలేజీ, కోర్సు వివరాలతో ఉన్న 'అలాట్‌మెంట్ లెటర్' డిస్ ప్లే అవుతుంది.
  5. ఆ పత్రాన్ని ప్రింట్ తీసుకోవడంతో పాటు భవిష్యత్తు అడ్మిషన్ అవసరాల కోసం దాని సాఫ్ట్ కాపీని సురక్షితంగా డౌన్‌లోడ్ చేసి ఉంచుకోవాలి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe