AP EAPCET Counseling : ఏపీ ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ సీట్ల కేటాయింపు పూర్తి - అలాట్ మెంట్ లింక్, రిపోర్టింగ్ తేదీలివే

AP EAPCET Bipc Stream Counseling : ఏపీ ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ బి-ఫార్మసీ, ఫార్మా-డీ సీట్ల కేటాయింపు పూర్తయింది. మొత్తం సీట్లలో 93.67 శాతం భర్తీకాగా, ఆగస్టు 31లోగా అభ్యర్థులు కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. 

Published on: Aug 29, 2026, 14:27:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

AP EAPCET Bipc Stream Counseling : ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET) బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్‌ కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. బీ-ఫార్మసీ, ఫార్మా-డీ కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించిన సీట్ల కేటాయింపు ప్రక్రియను శుక్రవారం అధికారులు అధికారికంగా పూర్తి చేశారు. ఈ ఏడాది విదేశీ, దేశీయ స్థాయిలో ఫార్మా రంగానికి ఉన్న డిమాండ్‌ను ప్రతిబింబిస్తూ, అందుబాటులో ఉన్న మొత్తం సీట్లలో ఏకంగా 93.67 శాతం సీట్లు భర్తీ కావడం విశేషం.

ఏపీ ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్
ఏపీ ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్

సీట్ల కేటాయింపు వివరాలు ఇలా…

రాష్ట్రవ్యాప్తంగా వివిధ కళాశాలల్లో ఉన్న బీ-ఫార్మసీ, ఫార్మా-డీ, ఇతర కోర్సులలో కలిపి మొత్తం 13,052 సీట్లు అందుబాటులో ఉండగా, మొదటి విడత కౌన్సెలింగ్ ముగిసే సమయానికి 12,226 సీట్లు భర్తీ అయ్యాయి.

  • బైపీసీ ఇంజినీరింగ్ : బైపీసీ విద్యార్థులకు కేటాయించిన 491 ఇంజినీరింగ్ సీట్లలో ఏకంగా 487 సీట్లు నిండాయి.
  • బీ-ఫార్మసీ : బీ-ఫార్మసీ కోర్సులో మొత్తం 10,958 సీట్లు అందుబాటులో ఉండగా, వీటిలో 10,142 సీట్లు కేటాయింపు పూర్తయింది.

ఈ ఏడాది నిర్వహించిన ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ పరీక్షల్లో మొత్తం 60,005 మంది విద్యార్థులు అర్హత సాధించారు. వీరిలో 23,614 మంది అభ్యర్థులు ప్రవేశాల ప్రక్రియ కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ధృవపత్రాల పరిశీలన అనంతరం వెబ్ ఐచ్ఛికాలు నమోదు చేసుకోవడానికి 21,793 మంది విద్యార్థులు అర్హత పొంది, తమకు కావలసిన కళాశాలలను ఎంచుకున్నారు.

రిపోర్టింగ్ తేదీలు…

సీట్లు పొందిన అభ్యర్థులు నిర్ణీత సమయానికి కేటాయించిన కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ జాయినింగ్ పూర్తి చేసి, సంబంధిత కాలేజీల్లో నేరుగా రిపోర్ట్ చేయడానికి 2026 ఆగస్టు 31 వరకు గడువు విధించారు. నిర్ణీత తేదీలోగా కాలేజీలో రిపోర్ట్ చేయని అభ్యర్థుల సీటు కేటాయింపు రద్దవుతుంది. కాబట్టి విద్యార్థులు వెంటనే అవసరమైన ధృవపత్రాలతో సంబంధిత విద్యాసంస్థలను సంప్రదించాలని అధికారులు సూచించారు.

అలాట్ మెంట్ డౌన్లోడ్ ఇలా…

  1. ముందుగా https://cap.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలోని క్యాండెట్ లాగిన్ ఆప్షన్ పై నొక్కాలి.
  3. మీ పేరు, పాస్ వర్డ్ వివరాలతో లాగిన్ కావాలి.
  4. మీకు సీటు కేటాయిస్తే మీ అలాట్ మెంట్ డిస్ ప్లే అవుతుంది.
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా ఈ కాపీని పొందొచ్చు.
  6. రిపోర్టింగ్ తో పాటు అడ్మిషన్ ప్రాసెస్ లో అలాట్ మెంట్ చాలా కీలకం.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More