AP Degree Admissions : డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్ అప్డేట్ - దగ్గరపడిన వెబ్ ఆప్షన్లు గడువు, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే

AP Degree Admissions 2026 Counselling : రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాలకు కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు ముగియగా... మరోవైపు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ గడువు కూడా ఈనెల 27వ తేదీతో ముగియనుంది.

Published on: Aug 26, 2026, 13:38:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

AP Degree Admissions 2026 Counselling : రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో మొదటి సంవత్సరం కోర్సుల్లో చేరేందుకు కౌన్సెలింగ్ ప్రక్రియ సాగుతోంది. 2026-27 విద్యాసంవత్సరానికి గాను డిగ్రీ ప్రవేశాల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువు ముగియగా... మరోవైపు వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ గడువు ఆగస్ట్ 27వ తేదీతో ముగుస్తుంది. సమయం దగ్గరపడిన నేపథ్యంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు వెంటనే వెబ్ ఆప్షన్ల ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఏపీ డిగ్రీ అడ్మిషన్ల కౌన్సెలింగ్
ఏపీ డిగ్రీ అడ్మిషన్ల కౌన్సెలింగ్

డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్ - ముఖ్య తేదీలు :

  • వెబ్ ఆప్షన్ల నమోదు : విద్యార్థులు తమకు నచ్చిన కళాశాలలు, కోర్సులను ఎంచుకోవడానికి ఆగస్ట్ 27వ తేదీ వరకు గడువు ఉంటుంది.
  • ఆప్షన్ల ఎడిట్ : నమోదు చేసుకున్న వెబ్ ఆప్షన్లలో ఏవైనా మార్పులు లేదా చేర్పులు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు ఈ నెల 28వ తేదీన ఎడిట్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
  • సీట్ల కేటాయింపు : విద్యార్థులు ఎంచుకున్న ఆప్షన్లు, ఇంటర్మీడియట్ మెరిట్ మార్కులు మరియు రిజర్వేషన్ల ఆధారంగా సెప్టెంబర్ 2వ తేదీన సీట్ల కేటాయింపు వివరాలను వెల్లడిస్తారు.
  • ఇక సీట్లు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ 3 నుంచి 7వ తేదీల మధ్య తమకు కేటాయించిన కళాశాలలకు నేరుగా వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్లను సమర్పించి సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాలి.
  • అధికారిక వెబ్ సైట్ - https://cap.apcfss.in/

మరోవైపు డిగ్రీ మొదటి సంవత్సరం రెగ్యులర్ తరగతులను సెప్టెంబర్ 3వ తేదీ నుంచే ప్రారంభించనున్నట్లు ఉన్నత విద్యాశాఖ స్పష్టం చేసింది. కాబట్టి విద్యార్థులు ఆఖరి నిమిషం వరకు వేచి చూడకుండా నిర్ణీత గడువు లోపలే వెబ్ ఆప్షన్ల ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు కోరారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More