AP EAPCET 2026 Counseling : ఏపీ ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ అప్డేట్ - వెబ్ ఆప్షన్లు ప్రారంభం

AP EAPCET BiPC Stream Counseling : ఏపీ ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఓవైపు రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా... మరోవైపు వెబ్ ఆప్షన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ నెల 23న సీట్లను కేటాయిస్తారు.

Published on: Aug 15, 2026, 13:54:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలో అగ్రికల్చర్, ఫార్మసీ, బయోటెక్నాలజీ తదితర వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET) 2026 బైపీసీ (BiPC) స్ట్రీమ్ కౌన్సెలింగ్‌ కొనసాగుతోంది. ఒకవైపు విద్యార్థుల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపుల ప్రక్రియ కొనసాగుతుండగా…. ప్రవేశాల ప్రక్రియలో అత్యంత కీలకమైన వెబ్ ఆప్షన్ల నమోదు కూడా అందుబాటులోకి వచ్చింది.

ఏపీ ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ అప్డేట్ - వెబ్ ఆప్షన్లు ప్రారంభం
ఏపీ ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ అప్డేట్ - వెబ్ ఆప్షన్లు ప్రారంభం

అభ్యర్థులు సాధించిన మెరిట్ ర్యాంకు, రిజర్వేషన్ కేటగిరీలను ప్రాతిపదికగా తీసుకుని ఈ నెల 23వ తేదీన మొదటి విడత సీట్లను కేటాయించనున్నట్లు ఉన్నత విద్యామండలి అధికారులు స్పష్టం చేశారు.

కౌన్సెలింగ్ షెడ్యూల్ — ముఖ్యమైన తేదీలు

  • రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు : ఆగస్టు 17వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి నమోదు చేసుకోవచ్చు.
  • సర్టిఫికెట్ల పరిశీలన : నిర్దేశిత సహాయ కేంద్రాల (HLCs) వద్ద ఆన్‌లైన్ ధ్రువపత్రాల పరిశీలన ఆగస్టు 18వ తేదీ వరకు కొనసాగుతుంది.
  • వెబ్ ఆప్షన్ల నమోదు : విద్యార్థులు తమకు కావలసిన కోర్సులు, ప్రాధాన్యత గల కళాశాలలను ఆగస్టు 19వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లుగా ఎంచుకోవచ్చు.
  • నమోదు చేసిన వెబ్ ఆప్షన్లలో ఏవైనా మార్పులు లేదా చేర్పులు చేసుకోవాలనుకుంటే ఆగస్టు 20న అవకాశం కల్పిస్తారు.
  • సీట్ల కేటాయింపు : మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా ఆగస్టు 23న ప్రథమ విడత సీట్లను కేటాయిస్తారు.
  • కళాశాలల్లో రిపోర్టింగ్: సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 24 నుంచి 27వ తేదీలోపు కేటాయించిన కళాశాలల్లో స్వయంగా రిపోర్ట్ చేసి అడ్మిషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది.

సీట్ల కేటాయింపు పూర్తయిన వెంటనే…. అంటే ఈ నెల 24వ తేదీ నుంచే కళాశాలల్లో తరగతులను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. కాబట్టి అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా…. నిర్దేశిత గడువు లోగానే సర్టిఫికేట్ల పరిశీలన, వెబ్ ఆప్షన్ల ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.

ఈ ఏడాది నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ - 2026 బైపీసీ (అగ్రికల్చర్, ఫార్మసీ) విభాగంలో విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. పరీక్ష రాసిన వారిలో ఏకంగా 89.59 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, మొత్తం 63,546 మంది అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు అర్హత పొందారు. అర్హత సాధించిన అభ్యర్థులందరూ ఈ కౌన్సెలింగ్ విధానంలో పాల్గొని తమకు నచ్చిన కోర్సు, కళాశాలలను ఎంచుకోవచ్చు.

ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంకుల ఆధారంగా వివిధ విడతల్లో ఈ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. సాధారణ కౌన్సెలింగ్ విడతలన్నీ పూర్తయిన తర్వాత కూడా ఏవైనా సీట్లు ఖాళీగా మిగిలిపోతే, వాటి భర్తీ కోసం ప్రత్యేకంగా స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలను ఉన్నత విద్యామండలి విడుదల చేయనుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More