AP EAPCET 2026 Counselling : ఏపీ ఈఏపీసెట్‌ తుది విడత కౌన్సెలింగ్ - వెబ్ ఆప్షన్లు ప్రారంభం, ముఖ్య తేదీలు

AP EAPCET 2026 Final Phase Counselling : ఏపీ ఈఏపీసెట్‌ 2026 ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు సంబంధించి తుది దశ కౌన్సెలింగ్‌ ప్రారంభమైంది. ఈనెల 20 వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ఈనెల 26న సీట్ల కేటాయింపు ఉంటుంది.

Published on: Aug 18, 2026, 15:37:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలో ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET) 2026 ప్రవేశాలకు సంబంధించిన చివరి విడత (ఫైనల్ ఫేజ్) కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటివరకు సీటు పొందని వారికి, వచ్చిన సీటు కంటే మెరుగైన కళాశాలలో అవకాశం కోసం చూస్తున్న అభ్యర్థులకు ఇది చివరి అవకాశం.

ఏపీ ఈఏపీసెట్‌ తుది విడత కౌన్సెలింగ్
ఏపీ ఈఏపీసెట్‌ తుది విడత కౌన్సెలింగ్

అభ్యర్థులు నిర్ణీత గడువులోగా అధికారిక వెబ్‌సైట్ ద్వారా ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, తమ ధ్రువపత్రాలను సరిచూసుకోవాలని కౌన్సెలింగ్ నిర్వహణ అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థుల సౌకర్యార్థం ఈఏపీసెట్ తుది విడత కౌన్సెలింగ్‌కు సంబంధించిన వివరాలను అధికారులు విడుదల చేశారు.

ఈఏపీసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ - ముఖ్యమైన తేదీలు:

  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్: ఆగస్టు 20, 2026 వరకు అవకాశం ఇచ్చారు.
  • హెల్ప్ లైన్ సెంటర్లలో సర్టిఫికెట్ల ఆన్‌లైన్ వెరిఫికేషన్: ఆగస్టు 21, 2026 వరకు పూర్తి చేస్తారు.
  • వెబ్ ఆప్షన్ల నమోదు : ఆగస్టు 22, 2026 వరకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.
  • వెబ్ ఆప్షన్లలో మార్పులు: నమోదు చేసుకున్న వెబ్ ఆప్షన్లను సరిదిద్దుకునేందుకు ఆగస్టు 23, 2026న అవకాశం కల్పిస్తారు.
  • సీట్ల కేటాయింపు (సీట్ అలాట్‌మెంట్): ఆగస్టు 26, 2026న ఫలితాలను విడుదల చేస్తారు.
  • కాలేజీలలో రిపోర్టింగ్ : సీటు పొందిన విద్యార్థులు ఆగస్టు 27, 2026 నుంచి ఆగస్టు 31, 2026 వరకు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌తో పాటు సంబంధిత కళాశాలల్లో వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉంటుంది.
  • తరగతుల ప్రారంభం : ఇంజినీరింగ్ కళాశాలల్లో ఆగస్టు 27, 2026 నుంచే తరగతులు ప్రారంభమవుతాయి.
  • అధికారిక వెబ్ సైట్ - https://cap.apcfss.in/

మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీటు రాని విద్యార్థులు, అలాగే మొదటి విడతలో సీటు వచ్చినా నచ్చక కొత్త ఆప్షన్లు ఇచ్చుకోవాలనుకునే విద్యార్థులు ఈ తుది విడతలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు. అయితే, మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీటు పొంది, ఆయా కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా సీటును ఖరారు (కన్ఫర్మ్) చేసుకున్న విద్యార్థులకు ఈ తుది విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అవకాశం ఉండదని స్పష్టం చేశారు. కాబట్టి అర్హులైన అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కౌన్సెలింగ్ కన్వీనర్ కోరారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More