AP EAPCET 2026 హాల్ టికెట్లు విడుదల - ఇలా డౌన్లోడ్ చేసుకోండి
AP EAPCET 2026 Hall Ticket : ఏపీఈఏపీసెట్ 2026 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు cets.apsche.ap.gov. వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనమిత్ర వాట్సాప్ లో కూడా అందుబాటులో ఉంటాయి.
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (AP EAPCET 2026) రాసే అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చింది. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అధికారిక వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటన ద్వారా సూచించారు.

AP EAPCET 2026 - హాల్ టికెట్ డౌన్లోడ్ ఇలా:
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.in సందర్శించాలి.
- హోం పేజీలో 'AP EAPCET - 2026' ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
- అక్కడ కనిపించే 'Download Hall Ticket' లింక్‌ను ఎంచుకోవాలి.
- మీ రిజిస్ట్రేషన్ నంబర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ (ఇంటర్) హాల్ టిక్కెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
- వివరాలు సమర్పించగానే మీ హాల్ టిక్కెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా హాల్ టికెట్ కాపీని పొందొచ్చు.
ఏపీ ఈఏపీసెట్ హాల్ టికెట్ పై ఉన్న అభ్యర్థి పేరు, ఫోటో, సంతకం, పరీక్షా కేంద్రం చిరునామా మరియు సమయం వంటి వివరాలను జాగ్రత్తగా సరిచూసుకోవాలి. ఏవైనా తప్పులుంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. పరీక్షా కేంద్రానికి హాల్ టిక్కెట్‌తో పాటు ప్రభుత్వం గుర్తించిన ఏదైనా ఫోటో గుర్తింపు కార్డు (ఆధార్, ఓటర్ ఐడీ మొదలైనవి) తప్పనిసరిగా తీసుకువెళ్లాలి. అభ్యర్థులు నిర్దేశించిన సమయం కంటే గంట ముందే కేంద్రానికి చేరుకోవడం ఉత్తమం.
APEAPCET 2026 పరీక్షల షెడ్యూల్:
- ఈసారి ఏపీ ఈఏపీసెట్ పరీక్షలను రెండు విభాగాలుగా నిర్వహించనున్నారు:
- ఇంజfనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు మే 12, 13, 14, 15, 18 తేదీల్లో జరుగుతాయి.
- అగ్రికల్చర్ - ఫార్మసీ స్ట్రీమ్ పరీక్షలు మే 19, 20 తేదీల్లో నిర్వహిస్తారు.
ప్రతిరోజూ రెండు షిఫ్టుల్లో (ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు) కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) పద్ధతిలో ఈ పరీక్షలు జరుగుతాయి.
ఏపీ ఈఏపీసెట్ - 2026 నిర్వహించిన తర్వాత ప్రాథమిక కీలను ప్రకటిస్తారు. ఆ తర్వాత ర్యాంకులను వెల్లడిస్తారు. విద్యార్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్ల భర్తీ కోసం ఉన్నత విద్యా మండలి కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ప్రకటించింది. విడతల వారీగా నిర్వహించే కౌన్సెలింగ్ ద్వారానే సీట్ల ప్రక్రయను పూర్తి చేస్తారు. సీట్లు మిగిలితే…. స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు జారీ అవుతాయి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

