ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ, ఈఏపీసెట్ (EAPCET) ఫలితాల విడుదలకు సంబంధించిన కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ రెండు కీలక పరీక్షల ఫలితాలు జూన్ మూడో వారంలోనే విడుదల చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.
ఈనెల 18లోపు సప్లిమెంటరీ ఫలితాలు…

రాష్ట్రంలో మే 21 నుంచి ప్రారంభమైన ఇంటర్ మొదటి, రెండో ఏడాది విద్యార్థుల అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్ థియరీ పరీక్షలు జూన్ 5వ తేదీతో విజయవంతంగా ముగిశాయి. అనంతరం ప్రాక్టికల్ పరీక్షలను ఆయా జిల్లాల హెడ్‌క్వార్టర్స్‌లో జూన్ 7 నుంచి జూన్ 11 వరకు నిర్వహించారు. దీంతో స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ ప్రక్రియను ఈనెల 18వ తేదీలోపే పూర్తి చేసి… ఫలితాలను ప్రకటించాలని అధికారులు భావిస్తున్నారు.
ఈ ఏడాది మొదటిసారిగా ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థులకు కూడా ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు రాసుకునే అద్భుతమైన అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ఈఏపీసెట్ 2026 ఫలితాల వెల్లడి ఆలస్యమైంది. ఈ ఫలితాలను ప్రకటించిన తర్వాత…. ఈఏపీసెట్ రిజల్ట్స్ అందుబాటులోకి రానున్నాయి.
ప్రాథమిక సమాచారం ప్రకారం… ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలను జూన్ 18వ తేదీలోపు విడుదల చేసే అవకాశాలున్నాయి. ఏపీ ఈఏపీసెట్ ర్యాంకుల కేటాయింపులో ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉన్న సంగతి తెలిసిందే. ఫలితంగా సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్ రాసిన విద్యార్థుల మార్కులను కూడా పరిగణనలోకి తీసుకుని ఈ వెయిటేజీని లెక్కించాల్సి ఉంటుంది. కాబట్టి… ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు అధికారికంగా విడుదలైన వెంటనే.. అదే జూన్ మూడో వారంలోనే ఈఏపీసెట్ ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది.
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,55,803 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 3,29,474 మంది ఈఏపీసెట్ పరీక్షలు రాశారు. అంటే మొత్తం 92.60 శాతం హాజరు నమోదైంది.
- ఇంజినీరింగ్, ఫార్మసీ (MPC స్ట్రీమ్): ఈ విభాగానికి అత్యధికంగా 2,76,576 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, వారిలో 2,58,545 మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ విభాగంలో అత్యధికంగా 93.48 శాతం హాజరు నమోదైంది.
- వ్యవసాయ, ఫార్మసీ (BiPC స్ట్రీమ్): అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు సంబంధించి మొత్తం 79,227 మంది దరఖాస్తు చేసుకోగా.. 70,929 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ స్ట్రీమ్‌లో 89.53 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఏపీ ఈఏపీసెట్ ఫలితాలను కూడా https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ లేదా మనమిత్ర వాట్సాప్(9552300009) ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ఏపీ ఈఏపీసెట్ 2026 లో విద్యార్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్ల భర్తీ కోసం ఉన్నత విద్యా మండలి కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ప్రకటించింది. విడతల వారీగా నిర్వహించే కౌన్సెలింగ్ ద్వారానే సీట్ల ప్రక్రయను పూర్తి చేస్తారు.
ప్రాథమిక సమాచారం మేరకు… ఈఏపీసెట్ -2026 ఫలితాలు వచ్చిన వెంటనే జూలై మొదటి వారంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.