AP EAPCET 2026 Results : ఏపీ ఎప్‌సెట్ - 2026 ఫలితాలు ఎప్పుడు..? ఇవిగో తాజా అప్డేట్స్
ఏపీ ఎప్‌సెట్ -2026 ఫలితాలు ఆలస్యం కానున్నాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 1న రావాల్సి ఉంది. కానీ ఈ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ/ఇంప్రూవ్‌మెంట్ మార్కులను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్నందున జూన్ మూడో వారంలో ఈ రిజల్ట్స్ విడుదలయ్యే అవకాశం ఉంది.
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మరియు ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఎప్‌సెట్ (AP EAPCET-2026) ఫలితాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది విద్యార్థుల ఉత్కంఠకు త్వరలోనే తెరపడనుంది. మొదట ప్రకటించిన అధికారిక షెడ్యూల్ ప్రకారం జూన్ ఒకటో తేదీనే (జూన్ 1) ఫలితాలు విడుదల కావాల్సి ఉన్నప్పటికీ…. సాంకేతిక కారణాల దృష్ట్యా ఫలితాల విడుదలను అధికారులు వాయిదా వేశారు.

ఫలితాలు ఆలస్యం… కారణాలు
ఏపీ ఎప్‌సెట్ ర్యాంకుల కేటాయింపులో ఇంటర్మీడియట్ మార్కులకు 25% వెయిటేజీ ఉంటుంది. ప్రస్తుతం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రభుత్వం ఇంప్రూవ్‌మెంట్, అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసే అవకాశాన్ని కల్పించింది. ఒకవేళ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల కంటే ముందే ఎప్‌సెట్ ర్యాంకులను ప్రకటిస్తే, ఆ తర్వాత మార్కులు పెరిగే విద్యార్థుల ర్యాంకుల్లో మార్పులు వచ్చి తీవ్ర గందరగోళం ఏర్పడుతుంది. ఈ గందరగోళానికి తావులేకుండా…. అత్యంత పారదర్శకంగా ర్యాంకులు కేటాయించాలన్న ఉద్దేశంతోనే సప్లిమెంటరీ ఫలితాలు వచ్చాకే ఎప్‌సెట్ ఫలితాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రస్తుతం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఇంప్రూవ్‌మెంట్ రాస్తున్న విద్యార్థుల సంఖ్య భారీగా ఉంది. అందులోనూ ఒక్క గణితం (మ్యాథ్స్) సబ్జెక్టు పరీక్ష రాస్తున్న వారే దాదాపు లక్ష మంది వరకు ఉన్నారు.ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 5వ తేదీతో ముగియనున్నాయి. పరీక్షలు ముగిసిన వెంటనే మూల్యాంకన ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయనున్నారు. ఆ దిశగా ఇంటర్ బోర్డు కూడా కార్యాచరణను సిద్ధం చేస్తోంది.
ఈనెల మూడో వారంలో ఫలితాలు…!
ఇంటర్ బోర్డు ఫలితాలు వెలువడిన వెంటనే…. వాటిని ఎప్‌సెట్ మార్కులకు అనుసంధానం చేసి జూన్ 16-18 మధ్య ఈఏపీసెట్ ఫలితాలను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫలితాల విడుదల తేదీపై అధికారికంగా తేదీని ప్రకటిస్తారు.
గత నెల (మే) 12వ తేదీ నుండి 20వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో ఈ ఎప్‌సెట్ పరీక్షలు జరిగాయి. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలన్నింటికీ కలిపి దాదాపు 3.29 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. జేఎన్టీయూ కాకినాడ ఈ పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది.
ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించి ప్రాథమిక కీలు, రెస్పాన్స్ షీట్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటిపై అభ్యంతరాల స్వీకరణ కూడా పూర్తి అయింది. కేవలం తుది ఫలితాలను మాత్రమే ప్రకటించాల్సి ఉంది.అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://cets.apsche.ap.gov.in/ ద్వారా రిజల్ట్స్ చెక్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక ఏపీ ఈఏపీసెట్ 2026 లో విద్యార్థులు సాధించే కంబైన్డ్ ర్యాంకుల ఆధారంగానే రాష్ట్రంలోని కాలేజీల్లో సీట్ల కేటాయింపు ఉంటుంది. ఫలితాల అనంతరం ఉన్నత విద్యా మండలి విడతల వారీగా కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ప్రకటించి ఆన్‌లైన్ వెబ్ కౌన్సెలింగ్ ద్వారా సీట్ల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తుంది. కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత కూడా సీట్లు మిగిలితే కాలేజీల వారీగా స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు జారీ అవుతాయి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

